బుధవారం 05 ఆగస్టు 2020
Jangaon - Jul 05, 2020 , 00:34:07

ఘనంగా మంత్రి ఎర్రబెల్లి జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి ఎర్రబెల్లి  జన్మదిన వేడుకలు

  • ఆలయాల్లో పూజలు, అన్నదానాలు
  • ఊరూరా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, నేతలు

జనగామ/పాలకుర్తిరూరల్‌/దేవరుప్పుల/కొడకండ్ల/లింగాలఘనపురం/నెహ్రూపార్క్‌, జూలై 04 : రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జన్మదిన వేడుకలు శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ పోకల జమున ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం అనంతరం భారీ కేక్‌ కట్‌చేసి మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఆయన పేరిట అధికార, ప్రతిపక్ష సభ్యులు హరితహారం మొక్కలు నాటారు. మంత్రి పుట్టినరోజు వేడుకలు పెద్దఎత్తున జరపాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశాలతో జరిగిన వేడుకల్లో వైస్‌ చైర్మన్‌ మేకల రాంప్రసాద్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. సభ్యులంతా కేక్‌ కట్‌చేసి మంత్రికి హ్యాపీ బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచారు. 

పాలకుర్తిలో..

 మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జన్మదిన వేడుకలను శనివారం టీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వ హించి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పుస్కూరి శ్రీనివాసరావు, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ బ్యాంక్‌ చైర్మెన్‌ బొబ్బల ఆశోక్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ వీరమనేని యాకాంతారావు, జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ మదార్‌, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మేడారపు సుధాకర్‌, రేపాల సుధాకర్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. శ్రీ సోమేశ్వ రాలయంలో పూజలు నిర్వహించగా, జర్నలిస్టులు మొక్కలు నాటారు, జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ మదార్‌ మంత్రి జన్మదినం సందర్భంగా తహసీల్థార్‌, ఎంపీడీవో కార్యాలయాలు, శ్రీ సోమేశ్వర ఆలయానికి శానిటైజర్‌ మిషన్లను అందజేశారు. రేపాల ఆశోక్‌ అన్నదానం చేశారు. లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు వర్రె వెంకన్న, రాపాక విజయ్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మండలంలోని తీగారంలో సర్పంచ్‌ పోగు రాజేశ్వరి శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ మొగుళ్ల కుమార్‌, ఎంపీటీసీ బెల్లి సోమయ్య ఆధ్వర్యంలో  మొక్కలు నాటి ఎర్రబెల్లి దయాకర్‌ రావు గార్డెన్‌గా నామకరణం చేశారు.

దేవరుప్పులలో..

మంత్రి ఎర్రబెల్లి పుట్టిన రోజు వేడుకలు మండలంలో ఘనంగా జరిగాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో 20 వేల మొక్కలు నాటినట్టు టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తీగల దయాకర్‌ తెలిపారు. మరోవైపు స్థానిక భ్రమరాంబమల్లికార్జున స్వామి దేవాలయంలో మంత్రి ఎర్రబెల్లి పేరున అభిషేకం, అర్చనలు చేయించారు. మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో నడపడానికి మంత్రికి దీవెనలు ఇవ్వాలని వేడుకున్నట్టు నాయకులు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఎర్రబెల్లి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు మండల కేంద్రంలో ఉన్న ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తూ లాక్‌డౌన్‌ సందర్బంగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న టీచర్లు, బస్‌ డ్రైవర్లు, ఆయాలకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువుల కిట్లను అందజేశారు. మరోవైపు సీతారాంపురంలోని ప్రేమసదనం అనాథ వృద్ధుల శరణాలయంలో ఎంపీపీ బస్వ సావిత్రి నేతృత్వంలో అన్నదానం చేశారు. పీఏసీఎస్‌ డైరెక్టర్‌ ఇరుకుల్ల సతీశ్‌ పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ మండల నాయకులు పల్ల సుందరరాంరెడ్డి, బస్వ మల్లేష్‌,ఈదునూరి నర్పింహారెడ్డి,ఆయా గ్రామాల సర్పంచ్‌లు బెత్లినా, కోనేటి సుభాషిణి,సుజనారెడ్డి, గోపాల్‌దాస్‌ మల్లేష్‌, రవి, వంగ పద్మ, రెడ్డిరాజుల రమేశ్‌, శ్రీనివాసరెడ్డి, శంకర్‌, అశోక్‌, జాటోతు కవిత, మాలోతు కవితమధుసూదన్‌, సుధాకర్‌, కోక్యానాయక్‌, గేమానాయక్‌, మండల నాయకులు లీనారెడ్డి, భిక్షపతి,సతీష్‌, చింత రవి, నక్క రమేశ్‌, మహేశ్‌, కిష్టయ్య, దశరథ, పెద్దారెడ్డి,తీగల సత్యనారాయణ,చిరంజీవి, నర్సయ్య.సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

లింగాలఘనపురంలో..

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లోని వారి నివాసంలో జెడ్పీటీసీ గుడివంశీధర్‌రెడ్డి శనివారం కలిశారు. మంత్రికి మొక్కనందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

మంత్రి ఎర్రబెల్లికి శుభాకాంక్షలు

రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్‌ భవన ఆవరణలో కలెక్టర్‌ నిఖిల మొక్కలు నాటారు. యశ్వంతాపూర్‌ సమీపంలోని టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ ఆవరణలో జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మంత్రి దయాకర్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పోకల జమున, వైస్‌ చైర్మన్‌ మేకల రాంప్రసాద్‌, కౌన్సిలర్‌ సుధా సుగుణాకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

కొడకండ్లలో..

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జన్మదిన వేడుకలు మండలంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు మొక్కలు నాటారు. డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుందూరు మెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి ఆదేశాల మేరకు మండలంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారని ఆయన చెప్పారు. స్థానిక మార్కెట్‌ కార్యాలయంలో, నర్సింహస్వామి గుట్టపై, ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. లక్ష్మక్కపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో టీఆర్‌ఎస్‌ నేతలు ఎర్రబెల్లి దంపతుల పేరున పూజలు చేశారు. దేవుడు మంత్రిని దీవించాలని వేడుకున్నట్లు నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దారవత్‌ జ్యోతి రవీంద్రనాయక్‌, జెడ్పీటీసీ కేలోత్‌ సత్తమ్మభిక్షపతినాయక్‌, మార్కెట్‌ చైర్మన్‌ రాము,  సర్పంచ్‌ మధుసూదన్‌, నాయకులు అందె యాకయ్య, దీకొండ వెంకటేశ్వర్‌రావు, సిందె రామోజీ, వైస్‌ ఎంపీపీ వీరస్వామి అమరేందర్‌రెడ్డి, మేటి సోమరాములు, చెంచు రాజిరెడ్డి, తహసీల్దార్‌ యాకయ్య, ఎంపీడీవో డాక్టర్‌ రమేశ్‌, ఏపీవో కుమార స్వామి గౌడ్‌, సునిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.logo