శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Jul 02, 2020 , 00:20:00

మొక్కల సంరక్షణ మనందరి బాధ్యత

మొక్కల సంరక్షణ మనందరి బాధ్యత

హరితహారం కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌, జూలై 01 : మొక్కల సంరక్షణ మనందరి బాధ్యత అని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. మండల కేంద్రం శివారులోని లిటిల్‌ ఫ్లవర్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం ఎమ్మెల్యే రాజయ్య మొక్కలు నాటారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్‌ గట్టు ప్రసాద్‌బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ హరితహారం తెలంగాణ సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక అన్నారు. రాష్ట్రం పచ్చదనంతో ఉండాలని సీఎం కోరిక అని పేర్కొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో స్థానికుడిగా తనకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని, నియోజక వర్గ ప్రజల రుణం తీర్చుకోడానికి ముందుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఒక డాక్టర్‌గా నా జీవిత కాలం పనిచేస్తానని చెప్పారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ 1978 నుంచి ఎస్సీ నియోజక వర్గమని చెప్పారు. మొదటి సారి ఎన్నికల్లో 10 వేలు, రెండోసారి 33 వేలు, మూడో సారి 58 వేలు, నాలుగో సారి 30 వేల మెజార్టీతో నియోజకవర్గ ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించారన్నారు. నియోజక వర్గంలో గట్టు ప్రసాద్‌బాబు తనకు రాజకీయ గురువని ఆయన అన్నారు. అనంతరం లిటిల్‌ ఫ్లవర్‌ పాఠశాల కరస్పాండెంట్‌ గట్టు ప్రసాద్‌బాబు, ప్రిన్సిపాల్‌ గట్టు స్వప్న దంపతులను ఎమ్మెల్యే రాజయ్య శాలువాతో ఘనంగా సన్మానించారు. సమావేశంలో జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ మారపాక రవి, ‘కుడా’ డైరెక్టర్‌ ఆకుల కుమార్‌, పార్టీ జిల్లా నాయకులు తోట వెంకన్న, అక్కినపల్లి బాలరాజు, డాక్టర్‌ ఎల్‌ జగన్‌, డాక్టర్‌ కే కుమార్‌, ఎంపీపీ కందుల రేఖగట్టయ్య, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు టీ సురేశ్‌కుమార్‌, ఉప సర్పంచ్‌ నీల ఐలయ్య, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, మునిగెల రాజు, దయాకర్‌, పార్టీ మండల అధ్యక్షుడు గట్టు రమేశ్‌, పట్టణ అధ్యక్షుడు బైరి బాలరాజు, తోట సత్యం, మునిగెల రాజు, యూత్‌ మండల అధ్యక్షుడు మారెపల్లి ప్రసాద్‌, నాయకులు చింత భరత్‌, దేవయ్య, చింత శ్రీను, సింగపురం రమేశ్‌కుమార్‌, ఎస్‌ కమలాకర్‌, చట్ల రాజు, ఊరడి లింగం, గోనెల ఉప్పలయ్య, బొల్లు లక్ష్మి ఉన్నారు.

VIDEOS

logo