ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Jul 02, 2020 , 00:19:56

టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

జిల్లా కలెక్టర్‌ నిఖిల

జఫర్‌ఘడ్‌, జూలై 01 : టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని జిల్లా కలెక్టర్‌ నిఖిల అన్నారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ ప్లాంటేషన్‌(పార్క్‌) స్థలాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. అనంతరం జఫర్‌ఘడ్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్క లు నాటారు. నిఖిల మాట్లాడుతూ క మ్యూనిటీ ప్లాంటేషన్‌కు ఇక్కడి స్థలం అనుకూలంగా ఉందన్నారు. పార్క్‌ అభివృద్ధిలో భాగం గా వాకింగ్‌ ట్రాక్‌, పార్క్‌ చుట్టూరా పూల మొ క్కల ఏర్పాటు, మంకీ ఫుడ్‌ కోర్టు ఏర్పాటు కు అధికారులు ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్‌ కోరారు. అనంతరం పార్క్‌ స్థలంలోని చారిత్రక కట్టడమైన బురుజు(బతారా) ను, సాగరం శివారులోని దంశా చెరువును నిఖిల సందర్శించారు. దంశా చెరువు అభివృద్ధికి సహకరించాలని ఎంపీపీ రడపాక సుదర్శన్‌ కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమాల్లో వైస్‌ ఎంపీపీ కనకయ్య, జెడ్పీటీసీ ఇల్లందుల బేబీ, జఫర్‌ఘడ్‌, తిడుగు, సాగరం గ్రామాల సర్పంచ్‌లు బల్లెపు వెంకట నర్సింగరావు, స్వప్న, గాదె ప్రవీణ్‌రెడ్డి, ఫారెస్ట్‌ అధికారి ఎండీ అక్బర్‌, బీఎఫ్‌వో రామలింగం, డీఆర్‌డీవో రాంరెడ్డి, ఆర్డీవో రమేశ్‌, ఎంపీడీవో శ్రీధర్‌స్వామి, ఎంపీవో శ్రీనివాస్‌, ఎంపీటీసీ లు రజిత, స్రవంతి పాల్గొన్నారు.


VIDEOS

logo