ప్రజా సంక్షేమమే సర్కారు ధ్యేయం

స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
రఘునాథపల్లి, జూలై 01 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని అశ్వరావుపల్లిలో రూ.కోటి 20 లక్షల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. మరోవైపు రూ.12.60 లక్షలతో నిర్మించే వైకంఠధామం, అశ్వరావుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి జాఫర్‌గూడెం వరకు రూ.62 లక్షలతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ రైతును రాజుగా చేసేందుకు సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా చేపట్టని విధంగా రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించడమేగాక వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల నాణ్యమైన కరంటును అందిస్తున్నారని తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పించడంతో పాటు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచారని, రైతుబంధు పథకంలో ఏడాదిలో ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తున్నారని రాజయ్య వివరించారు.
అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు..
అర్హులందరికీ త్వరలోనే డబుల్బెడ్రూం ఇండ్లను మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. గ్రామంలో 40 బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల వరలక్ష్మి, జెడ్పీటీసీలు బొల్లం అజయ్‌కుమార్, తహసీల్దార్ బన్సీలాల్, విద్యుత్‌శాఖ ఎస్ఈ మల్లికార్జున్‌రావు, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు మడ్లపల్లి సునీత, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పోకల శివకుమార్, సర్పంచ్ సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీ సుల్తాన్ దేవేందర్‌రెడ్డి, నాయకులు గుడి రాంరెడ్డి, వారాల రమేశ్‌యాదవ్, నామాల బుచ్చయ్య, కుర్ర కమలాకర్, రాజేందర్, గొరిగె రవి పాల్గొన్నారు.
తాజావార్తలు
- వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏడుగురు నిందితులు అరెస్ట్
- 87 లక్షలు పెట్టి ఇల్లు కొని.. భారీ సొరంగం తవ్వి.. వెండి చోరీ
- ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామాకు సిద్ధం
- కొవిడ్-19పై అప్రమత్తత : రాష్ట్రాలకు కేంద్రం లేఖ!
- ఐపీఎల్- 2021కు ఆతిథ్యమిచ్చే నగరాలు ఇవేనా?
- అలిపిరి నడకమార్గంలో భక్తుడు గుండెపోటుతో మృతి
- చైనాకు అమెరికా బాకీ.. ఎంతంటే..?
- పొరపాటున గన్‌తో వ్యక్తి కాల్పులు.. మరణించిన మేనల్లుడు
- కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలయ్యిందా..?
- అనసూయ మాస్ మసాలా డ్యాన్స్.. స్టిల్స్ చక్కర్లు