సోమవారం 06 జూలై 2020
Jangaon - Jun 30, 2020 , 05:30:35

కేసీఆర్‌ ఆశీస్సులతో కోలుకున్నా : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

కేసీఆర్‌ ఆశీస్సులతో కోలుకున్నా :  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

జనగామ: తాను సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నానని, త్వరలోనే ప్రజలకు అందుబాటులో ఉంటానని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ఫోన్‌లో మాట్లాడారు. తాను కరోనాతో అస్వస్థతకు గురైం ది మొదలు సీఎం కేసీఆర్‌ సహా.. మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ తమ ఆరోగ్య పరిస్థితిని నిత్యం వాకబు చేశారన్నారు. తాను త్వరగా కోలుకోవాలని మండలి చైర్మన్‌, స్పీకర్‌, మంత్రులు, ఎంపీలు,  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసనమండలి ఛీప్‌విప్‌, విప్‌లు, కార్పొరేషన్‌ చైర్మన్లు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా నిత్యం దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


logo