శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Jun 29, 2020 , 03:25:50

ఘనంగా పీవీ జయంతి వేడుకలు

 ఘనంగా పీవీ జయంతి వేడుకలు

  • పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

కలెక్టరేట్‌, జూన్‌ 28 : దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు దేశానికి అందించిన సేవలు మరువలేనివని, ప్రధాని పదవికి ఆయన వన్నెతెచ్చారని కలెక్టర్‌ నిఖిల అన్నారు. పీవీ నర్సింహారావు శత జయంతి సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాల యంలో పీవీ చిత్రపటానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో నిఖిల మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు పీవీ నర్సింహారావు ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. బహుభాషా కోవిదుడైన పీవీ తెలంగాణ ముద్దుబిడ్డ కావడం మనకు గర్వకారణమని అన్నారు. ఉన్నతమైన ఆయన జీవన విధానాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమం లో డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్‌, డీఆర్‌వో మాలతి, ఆర్డీవో మధుమోహన్‌, ఏవో విశ్వప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

డీసీపీ కార్యాలయంలో..

జనగామ క్రైం : భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి సందర్భంగా ఆదివారం జనగామలోని వెస్ట్‌జోన్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో పీవీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పీవీ నర్సింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా, భారతదేశానికి ప్రధానిగా సేవలందించారని, ఎన్నో సంస్కరణలు చేపట్టి దేశ పురోగతిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. పీవీ తెలంగాణ బిడ్డకావడం, ఆయన శత జయంతి వేడుకలను జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ ఏసీపీ వినోద్‌ కుమార్‌, సీఐ మల్లేశ్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఐ మల్లేశ్‌, ఎస్సైలు కే శ్రీనివాస్‌, బీ రాజేశ్‌నాయక్‌, ఎస్‌బీ ఎస్సై వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

బచ్చన్నపేటలో..

బచ్చన్నపేట : మండలంలోని పోచ్చన్నపేటలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పీవీ జయంతి వేడుకలను నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం నాయకులు మాట్లాడుతూ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత పీవీకే దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఆధ్యక్షుడు నిడిగొండ శ్రీనివాస్‌, కార్యదర్శి గంగం బుచ్చిరెడ్డి, ఎస్సీ సెల్‌ మండల కన్వీనర్‌ ఆల్వాల ఎల్లయ్య, సర్పంచ్‌ గట్టు మంజుల, నాయకులు నరేశ్‌, మల్లయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.  

నర్మెటలో..

నర్మెట : దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి వేడుకలను ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొంపెల్లి రమేశ్‌, డీసీసీ కార్యదర్శి భూక్య జయరాంనాయక్‌, మండల అధ్యక్షుడు జంగిటి అంజ య్య, పీఏసీఎస్‌ డైరెక్ట ర్‌ కూకట్ల చంద్రమౌళి, నా యకులు యాదయ్య, సారా బు మధు, యాట క్రాంతి కుమార్‌, వలబోజు శ్రీనివాస్‌, పండ్ల బాలనర్సు పాల్గొన్నారు.

VIDEOS

logo