ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Jun 17, 2020 , 03:35:46

జనగామలో కలకలం

 జనగామలో కలకలం

  •  జిల్లా కేంద్రంలోని అతిపెద్ద ఫర్జిలైజర్‌ షాపు నిర్వాహకుడికి పాజిటివ్‌
  •  భాగస్వాములకు వైద్య పరీక్షలు
  •  కొనుగోలుదారుల్లో గుబులుదుకాణాన్ని మూసివేయించిన అధికారులు
  • ‘నమస్తే తెలంగాణ’లో ముందే హెచ్చరికలు

లాక్‌డౌన్‌ ఎత్తేసినంత మాత్రాన కరోనా పూర్తిగా పోయినట్టు కాదని, ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించకుంటే భారీ మూల్యం తప్పదని సర్కారుతో పాటు అధికారయంత్రాంగం ఎంత మొత్తుకున్నా ఫలితం లేకుండా పోతున్నది. నిన్నమొన్నటిదాకా అదుపులో ఉందనుకున్న వైరస్‌, నాలుగైదు రోజులుగా విజృంభిస్తున్నది. జనగామ జిల్లా కేంద్రంలో అతిపెద్ద ఫర్టిలైజర్‌ షాపు నిర్వాహకుల్లో ఒకరికి మంగళవారం పాజిటివ్‌గా నిర్ధారణ కావడం స్థానికంగా కలకలం రేపింది. మిగతా భాగస్వాములకు, సిబ్బందికి, ఇతర కాంటాక్టులందరికీ వైద్య పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించగా వారం పది రోజుల నుంచీ దుకాణంలో కొనుగోళ్లకు వచ్చివారిలో గుబులు రేగుతున్నది.     -జనగామ 

జనగామ, జూన్‌ 16:  జనగామ జిల్లా కేంద్రంలో అతిపెద్ద ఫర్టిలైజర్స్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ యజమానికి కరోనా పాజిటి వ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపుతున్నది. నిత్యం వంద లాది మంది రైతులతో కిక్కిరిసి ఉండే ‘అగ్రిమాల్‌'లో ఓ నిర్వాహకుడికి వైరస్‌ సోకడంతో ఉలిక్కిపడిన యంత్రాంగం, మంగళవారం హుటాహుటిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ను కోర్లినేష న్‌ చేయించి మూసివేయించింది. ఇందులోని మిగతా భాగ స్వాములు, సిబ్బంది, ఇతర కాంటాక్టులందరికీ కరోనా పరీక్ష లు చేయించాలని అధికారులు నిర్ణయించారు. 

కొనుగోలుదారుల్లో ఆందోళన

షాపులో కొనుగోలు చేసిన రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొ న్నది. తమకు కరోనా సోకిందా? ఇప్పుడు ఏం చేయాలి? పరీక్షలు చేయించుకోవాలా? లక్షణాలుంటేనే పరీక్షలు చే యించుకోవాలా? హోం క్వారంటైన్‌లో ఉండాలా? అనే సందేహాలు వ్యక్తం చేస్తూ జిల్లా వైద్యాధికారులను ఫోన్‌లో సంప్రదిస్తు న్నట్లు తెలుస్తున్నది. మరోవైపు జనగామ ఎమ్మెల్యేకు ఆయన సతీమణికి, డ్రైవర్‌, గన్‌మన్‌, హైదరాబాద్‌లో వంటమనిషికి కరోనా పాజిటివ్‌ రావడంతో హోంక్వారంటైన్‌లోనే చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత జనగా మలో ఆయన వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న యు వకుడు ముందు జాగ్రత్తగా వరంగల్‌లో కరోనా పరీక్షలు చేయించుకో గా, మంగళవారం నెగెటివ్‌ రిపోర్టు వ చ్చింది. దీంతో ఆయన కాంటాక్టులో ఉన్న కుటుంబసభ్యులు, బంధువు లు, మిత్రులు ఊపిరిపీల్చుకున్నారు. 

వారం క్రితమే ‘నమస్తే’లో హెచ్చరికలు

వారంరోజుల క్రితమే జిల్లా కేం ద్రంలో అగ్రిమాల్‌లో కిక్కి రిసిపోయి మాస్కులు, భౌతికదూరం పాటించకుండా రైతు లు కొనుగోలు చేస్తున్న దృశ్యాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఉమ్మ డి జిల్లా ప్రధాన పేజీలో ‘చిన్న నిర్లక్ష్యం..పెద్ద మూల్యం’ శీర్షికన ప్రచురించింది. పత్రికలో కథనం వ చ్చిన తర్వాత ఒకటి, రెండురోజులు దుకాణం ఎదుట బారికే డ్లు ఏర్పాటు చేసి కట్టడి చేసిన యజమాన్యం తర్వాత యథావిధిగా అమ్మకాలు జరిపిందని రైతులు ఆరోపిస్తున్నారు. 

అప్రమత్తమైన యంత్రాంగం

కరోనా కలకలంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విస్తృత ప్రచారం, అవగాహన కల్పిస్తోంది. ఆర్టీసీ బస్టాండ్‌లో శుభ్రత కార్యక్రమాలు చేపట్టి బస్సు సీట్లను ప్రత్యేక లిక్విడ్‌తో శుభ్రం చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌ వంటి రద్దీ ప్రాంతాల్లో ముం దస్తు చర్యలు చేపడుతున్నారు. రెండు సంఘటనలతో జిల్లా కేంద్రానికి ప్రజల రాకపోకలు, దుకాణాల్లో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. ఎప్పుడూ రద్దీ  ఉండే ప్రాంతాలు మంగళవారం జనంలేక బోసిపోయి కనిపించాయి. 

ప్రధాన దవాఖానలో ఐసోలేషన్‌ వార్డు

జిల్లా ప్రధాన దవాఖానలో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేశా రు. వైద్యులు, సిబ్బంది, అవసరమైన మందులు, సామగ్రిని అందుబాటులో ఉంచారు. అత్యవసరమైతే ఎక్కువ మందికి వైద్య సేవలందించేలా పట్టణ శివారులోని శామీర్‌పేట అనాథ వృద్ధాశ్రమంలో క్వారంటైన్‌ ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతున్నది. 

కొండాపూర్‌వాసికి కరోనా..

రాయపర్తి: హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మం డలంలోని కొండాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్‌-19 వైరస్‌ బారిన పడినట్లు సమాచారం. మండ ల వైద్యాధికారి భూక్య వెంకటేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌ లోని వృద్ధాశ్రమంలో నర్సింగ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నా డు. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతూ మంగళ వారం కింగ్‌ కోఠి దవాఖానకు వెళ్లి పరీక్షలు చేసుకోగా పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. అయినప్పటికీ బాధిత వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతో చికి త్స నిర్వహించి మందులు ఇచ్చి 10 రోజులపాటు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని సూచించినట్లు తెలిపారు. 

VIDEOS

logo