మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Jun 15, 2020 , 02:10:42

మరోమారు ఆరోగ్య సర్వే

మరోమారు ఆరోగ్య సర్వే

  • జనగామ జిల్లాలో 20 తర్వాత రెండో విడుత
  • నమూనాల సేకరణకు రానున్న ఐసీఎంఆర్‌ బృందాలు
  • గత నెలలో చేసిన ప్రాంతాల్లోనే మళ్లీ 
  • తొలివిడతలో తేలిన రెండు పాజిటివ్‌లు

 జనగామ, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఆధ్వ ర్యంలో జిల్లాలో తొలివిడత ర్యాండమ్‌ సర్వే చేశారు. తొమ్మి ది గ్రామాలతోపాటు జనగామ జిల్లా కేంద్రంలోని 2వ వార్డు ను ఎంచుకొని రెండు రోజుల్లో 400 నమూనాలు సేకరించా రు. చెన్నైలోని ప్రయోగశాలకు పంపించి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌ అని తేలింది. వరుసగా మూడు నెలలు ర్యాండమ్‌ పరీక్షలు చేయనుండగా రెండో విడత సర్వే కోసం ఈనెల 20తర్వాత ఐసీఎంఆర్‌ బృందం పర్యటించే అవకా శముంది. మొదటి విడత ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే నమూ నాలు సేకరించనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఐసీఎంఆర్‌ బృందం అంచనా వేస్తుం ది. ఎంపిక చేసిన ప్రాంతంలో 40 మంది చొప్పున మొత్తం 400 మంది నమూనాలు సేకరించనుంది. ఇందులో 18 ఏళ్ల పైబడిన వారు ఉండేలా చూసుకుంటారు. మొదటి విడత గత నెల 15, 16 తేదీల్లో ఐదు బృందాలు నమూనాలు సేకరించాయి. మొదటి రోజు జిల్లా కేంద్రంలోని 2వ వార్డు, బచ్చన్నపేట మండలం కొడవటూరు, నర్మెట మండలం హ న్మంతాపూర్‌, లింగాలఘనపురం మండలం కళ్లెం, దేవరుప్పుల మండలం మాదాపురం, రెండో రోజు స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం రాఘవపూర్‌, జఫర్‌ఘడ్‌ మండల కేంద్రం, పాలకుర్తి మండలం మంచుప్పుల, రఘునాథపల్లి మండలం కంచెనపల్లి, కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లిలో నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపారు. అక్కడ పరీక్షల అనంతరం నివేదికల్ని ప్రభుత్వానికి అందించారు. 400 నమూనాల్లో ఇద్దరికి పాజిటివ్‌ అని తేలినట్లు అప్పట్లోనే ఐసీఎంఆర్‌ రాష్ట్ర డైరెక్టర్‌ లక్ష్మయ్య తెలిపారు. మొదటి విడతలో జిల్లాలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందంటే అప్పటికే వారి శరీరాల్లో వైరస్‌ ప్రవేశించి పక్షం రోజులు అయి ఉంటుంద ని, రెండో విడత నమూనాల సేకరణ తేదీలు నిర్ణయం కాలేద ని చెప్పారు. ఒకసారి వైరస్‌ సోకి కోలుకున్న తర్వాత మరోసారి అదే రూపంలో ఉన్న వైరస్‌ సోకితే కొవిడ్‌ వ్యాపించే అవకాశాలు అతి తక్కువగా ఉంటాయని, వైరస్‌ రూపం మా ర్చి సోకితే మాత్రం తీవ్రత ఎక్కువ ఉంటుందని వివరించా రు. వైరస్‌ రూపం మారడంపై స్పష్టంగా చెప్పలేమని, ప్రజలే ఎప్పటకప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


VIDEOS

logo