సోమవారం 01 మార్చి 2021
Jangaon - Jun 14, 2020 , 01:23:03

పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహం

పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహం

జనగామ రూరల్‌, జూన్‌13: పాడిరైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో కిసాన్‌ క్రెడిట్‌కార్డు కోసం లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తోంది. పాడి రైతులకు అవసరమయ్యే రుణాలు ఇచ్చేందుకు శ్రీకారం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పాడి రైతులు ఈలాబ్‌లో నమోదైన వారు సుమారు 14 వేల మంది ఉండగా, మిగితా రైతులను ఎంపిక చేయడం కోసం కృషి చేస్తున్నామని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి మాచర్ల భిక్షపతి శనివారం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కోసం పాడి రైతుల జాబితాను సిద్ధం చేస్తున్నామని ఆయన వివరించారు. విజయ డెయిరీ, నార్మల్‌ డెయిరీ, మదర్‌ డెయిరీ, ముల్కనూరు డెయిరీలలో సభ్యులను గుర్తించామని పేర్కొన్నారు. వీటిలో 14 వేల పాడి రైతులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. పాడిరైతులకు ప్రభుత్వం రూ. 1.5 లక్షలు ఇవ్వడానికి నిర్ణయించిందని, ఇప్పటికే పాడి పశువులు ఉన్న రైతులకు మళ్లీ అదనంగా గేదెలు కొనుగోలు చేసుకోవడానికి సహకారం అందిస్తుందన్నారు. లేదంటే ఉన్న వాటికి మేత కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో అర్హులైన పాడి రైతులను ప్రోత్సహించి రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. 

VIDEOS

logo