ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆరోగ్యంగా ఉండాలని పూజలు

జనగామ/జనగామరూరల్/లింగాలఘనపురం, జూన్ 13 : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అనారోగ్యాన్ని జయించి త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునేలా భగవంతుడు ఆశీస్సులు అందించాలని కోరుతూ శనివారం నియోజకవర్గ వ్యాప్తింగా టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని బాణాపురం శ్రీహనుమాన్ ఆలయంలో 21వ వార్డు కౌన్సిలర్ కర్రె శ్రీనివాస్, కొమురవెల్లి మల్లన్న ఆలయంలో మాజీ దేవస్థాన చైర్మన్ సేవెల్లి సంపత్, బతుకమ్మకుంట దుర్గామాత ఆలయంలో టీఆర్ఎస్ నాయకులు దామెర రాజు ప్రత్యేక పూజలు చేశారు. వీరితోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వార్‌లో ముత్తిరెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని సేవలందించాలని ప్రార్ధనలు చేశారు.
పలు ఆలయాల్లో పూజలు
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ శనివారం మండలంలోని పలు ఆలయాల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ రావడంతో ఆందోళనకు గురైన పార్టీ శ్రేణులు పెంబర్తి, వడ్లకొండలోని హనుమాన్, దుర్గామాత ఆలయాల్లో పూజలు చేశారు. దుర్గామాతకు ఒడిబియ్యం సమర్పించారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ జిల్లా నాయకులు బాల్దె సిద్దిలింగం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు బొల్లం శారదస్వామి, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ మూల రవిగౌడ్, పెంబర్తి తాత్కాలిక సర్పంచ్ గంగరబోయిన కవితకరుణాకర్, నాయకులు ఆంజనేయులు, చల్లగురుగుల శ్రీనివాస్, రంగు నర్సింహాచారి, రాజు, అప్పయ్య, మంద లక్ష్మయ్య, సంకటి ఎల్లయ్య, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.