పూర్తికాని కాలువ లైనింగ్ పనులు

- సాగునీటిలో కలుస్తున్న డ్రైనేజీ నీరు
- పనులపై కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
- దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు
స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్, జూన్ 10: మండల కేంద్రంలోని 12వ వార్డు గుండా పంట పొలాలకు వెళ్తున్న దేవాదుల తూము కాలువ పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఇండ్ల నుంచి వచ్చే డ్రైనేజీ నీరు కాలువలో కలువడంతో దుర్వాస వస్తోందని ఎస్సీ కాలనీ ప్రజలు వాపోతున్నారు. ఎస్సీ కాలనీవాసుల కథనం మేరకు.. స్టేషన్‌ఘన్‌పూర్ దేవాదుల రిజర్వాయర్ తూము నుంచి ఎస్సీ కాలనీ మీదుగా పంట పొలాలకు కాలువ నిర్మాణానికి రెండేండ్ల క్రితం నిధులు మంజూరయ్యాయి. స్టేషన్‌ఘన్‌పూర్ దేవాదుల రిజర్వాయర్ తూము నుంచి చేపట్టిన కాలువ లైనింగ్ సింగపురం కిషన్ ఇంటి వరకు పూర్తి చేసి వదిలేశారు. లైనింగ్ పనులు అసంపూర్తిగా మిగలడంతో ఇండ్ల నుంచి వచ్చే మురుగు నీరు కాలువ గుండా ప్రవహిస్తోంది. కాలువ పరిసరాల్లోని ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గతంలో కాలనీకి చెందిన ప్రజలు విషజ్వరాల బారిన పడ్డారు. ఈగలు, దోమలు, పందుల బెడద ఎక్కువైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి 200 మీటర్ల వరకు నిలిచిపోయిన కాలువ పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.
దుర్వాసన వస్తోంది..
ఎస్సీ కాలనీలో కాలువ పనులు పూర్తి చేయడం లేదు. ఇళ్ల నుంచి వచ్చే మురికి నీరు కాలువలో నిలిచి దుర్వాస వస్తున్నది. పనులు పూర్తి చేయాలని పలుమార్లు కాంట్రాక్టర్‌ను వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. అధికారులు స్పందించి కాలువ పనులు పూర్తి చేయించాలి.
- సింగపురం అరుణ, ఎస్సీ కాలనీవాసి
ఎమ్మెల్యే రాజయ్య దృష్టికి తీసుకెళ్తా..
ఎస్సీ కాలనీలో జనావాసాల మధ్య నుంచి వెళ్తున్న కాలువ లైనింగ్ పనులు అసంపూర్తిగా మిగిలాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే రాజయ్య దృష్టికి తీసుకెళ్లి కాలువ పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తా.
- సింగపురం లక్ష్మి , వార్డు సభ్యురాలు
తాజావార్తలు
- డిజిటల్ స్కిల్స్‌కు డిమాండ్: క్యాప్‌జెమినీలో కొలువుల పంటే..!!
- క్రిప్టో కరెన్సీల్లో రికార్డు: బిట్ కాయిన్ 6% డౌన్.. ఎందుకో తెలుసా!
- చెన్నైలో ఈవీ చార్జింగ్ స్టేషన్.. టాటా పవర్+ఎంజీ మోటార్స్ జేవీ
- లీజు లేదా విక్రయానికి అంబాసిడర్ కంపెనీ!
- హార్టికల్చర్ విధాన రూపకల్పనకు సీఎం కేసీఆర్ ఆదేశం
- పల్లా గెలుపుతోనే సమస్యల పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!