జనగామకు గో‘దారి’ కళ

- కాల్వల ద్వారా చెరువులు, రిజర్వాయర్లకు నీరు
- నిండుకుండల్లా మారుతున్న తటాకాలు
- జిల్లాలో దేవాదుల ద్వారా 287 చెరువుల్లో గోదావరి జలాలు
జనగామ, నమస్తే తెలంగాణ : ఒకప్పుడు కాలువల్లేవు.. చెరువులున్నా నీరు ఇంకి పోయి ఉండేవి. సాగుకు నీరు ఉండేది కాదు. కరువుకు కేరాఫ్‌గా , నీరు ఎరగని ప్రాంతంగా ఉండేది జనగామ. ఇదంతా నాటి ముచ్చట్లే. ఇప్పుడు అప్పటి పరిస్థితికి పూర్తి భిన్నం. పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. గోదావరి జలాలతో చెరువులు నిండు కుండలా మారాయి. సాగు నీరు వస్తుందనే మాటను విశ్వసించని వారు నేడు పంట కాలువల్లో నీరు చూసి మా జనరేషన్లో ఇలా నీరు వస్తుందని ఊహించలేదని చెప్పిన వారెందరో ఉన్నారు. చెరువులు, రిజర్వాయర్లలో జల కళ కనిపిస్తున్నది. దేవాదుల ద్వారా వస్తున్న నీటిని చూసి అన్నదాత ధైర్యంగా, సంబురంగా ఉంటున్నాడంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో 946 చెరువులు ఉన్నాయి. వీటి కింద 52,853.92 ఎకరాల ఆయకట్టు ఉంది. మిషన్ కాకతీయ కింద నాలుగు విడుతల్లో చెరువుల పునరుద్దరణ పనులు జరిగాయి. జిల్లాలో 28 చెక్ డ్యాంల నిర్మాణం కొత్తగా ప్రారంభమయ్యాయి. దేవాదుల ప్రాజెక్ట్ కోసం జిల్లాలో 12,311 ఎకరాల భూమిని సేకరించారు. దేవాదుల ద్వారా 287 చెరువులను నింపారు. తద్వారా 97,917 ఎకరాల ఆయకట్టుకు సేద్యానికి నీరు అందిస్తున్నారు. లింగంపల్లి, బొమ్మకూర్ తదితర రిజర్వాయర్లలో నీరు నిల్వ ఉంది. బొమ్మకూరు నుంచి మరిగడి మీదుగా పసరమడ్ల చెరువులోకి నీరు చేరింది. శామీర్‌పేట మీదుగా పెంబర్తి వైపు నీరు పారుతూ జలశయాలు చూడముచ్చటగా మారాయి.
తాజావార్తలు
- కన్నడ కవి లక్ష్మీనారాయణ భట్ట కన్నుమూత
- ఈ నెల 11 నుంచి జూబ్లీహిల్స్ వెంకన్న బ్రహ్మోత్సవాలు
- ఆమె రాజకీయ ఆటలోపడి లక్ష్యాలు మరిచారు: దినేశ్ త్రివేది
- తుపాకీ లైసెన్స్ ఇవ్వండి.. పోలీసులకు హత్రాస్ యువతి విజ్ఞప్తి
- భారీ మెజారిటీతో ‘పల్లా’ను ఎమ్మెల్సీగా గెలిపించాలి : మంత్రి ఎర్రబెల్లి
- కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. రంజీ మాజీ క్రికెటర్ అరెస్ట్
- రష్మీ హాట్ అందాలకు యువత దాసోహం
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏండ్లు.. గవాస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?