మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Jun 09, 2020 , 05:57:36

డిమాండ్‌కు అనుగుణంగా 24 గంటలు విద్యుత్‌

డిమాండ్‌కు అనుగుణంగా 24 గంటలు విద్యుత్‌

ఎన్‌పీడీసీఎల్‌ ఆపరేషన్స్‌ ఎస్‌ఈ  మల్లికార్జున్‌ 

దేవరుప్పుల, జూన్‌ 08; వానకాలంలో పంటల విస్తీర్ణం పెరిగి విద్యుత్‌ అవసరాలు పెరిగినా 24 గంటలు కరంట్‌ సరఫరాకు ఏర్పాట్లు చేసినట్టు ఎన్‌పీడీసీఎల్‌ ఆపరేషన్స్‌ ఎస్‌ఈ జి,మల్లికార్జున్‌ తెలిపారు. మండలంలోని ప్రీమాన్‌సూన్‌ సర్వే పనులు జరుగుతున్న పలు ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. అనంతరం మండల కేంద్రంలోని ఏడీఈ కార్యాలయంలో మల్లికార్జున్‌ మాట్లాడుతూ జిల్లాలో కరంటు లోడు 6 నుంచి పదిశాతం పెరుగుతుందని అంచనా వేశామని, ఇందుకనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని సబ్‌స్టేషన్ల కెపాసిటీ పెంచామని, ఓవర్‌లోడ్‌ ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల కెపాసిటీ పెంచుతామన్నారు. వానకాలం సమీపిస్తున్న ఈ తరుణంలో ప్రీమాన్‌సూన్‌ సర్వేలో భాగంగా లూజ్‌ లైన్లు రిపేరు చేస్తున్నామని, అవసరమైన చోట స్తంభాలు వేస్తున్నామన్నారు. మరోవైపు జిల్లాలో మండలగూడెం, మీదికొండ, నారాయణపూర్‌లలో 132 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు నిర్మాణాలు జరుగుతున్నాయని, అవి త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. మండలంలోని సింగరాజుపల్లిలో 132 కేవీ సబ్‌స్టేషన్‌ ప్రతిపాదనలో ఉందని ప్రభుత్వం అనుమతివస్తే ఈ ప్రాంతంలో ఓవర్‌లోడ్‌ సమస్య ఉండదన్నారు. రైతులకు, గృహోపయోగ, పరిశ్రమలకు  24 గంటల కరెంటు సరఫరా ఉంటుందని స్పష్టం చేశారు.


VIDEOS

logo