శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Jun 09, 2020 , 05:55:14

వ్యక్తిగత పరిశుభ్రతతోనే కరోనా కట్టడి

వ్యక్తిగత పరిశుభ్రతతోనే కరోనా కట్టడి

ఎమ్మెల్యే డాక్టర్‌ టీ రాజయ్య

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌, జూన్‌ 08: చాపకింద నీరులా విజృంభిస్తున్న కరోనాను వ్యక్తిగత పరిశుభ్రతతోనే కట్టడి చేయవచ్చని ఎమ్మెల్యే డాక్టర్‌ టీ రాజయ్య అన్నా రు. మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం దా దాపు 150 మంది వృద్ధులకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రామునాయక్‌ అధ్యక్షత నిర్వహించిన సమావేశం లో ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య, కలెక్టర్‌ నిఖి ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ కరోనా మహమ్మారి నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్త లు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వ్యక్తిగ త పరిశుభ్రత, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటిస్తే వైరస్‌ దరి చేరదన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. కరోనా కట్టడికి పోలీసు, రెవెన్యూ, వైద్య,  పారిశుధ్య సిబ్బంది, జర్నలిస్టులు, అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రాణాలను లెక్క చేయకుండా కృషి చేయడం హర్షణీయమన్నారు.

కలెక్టర్‌ నిఖిల మాట్లాడుతూ ఇప్పటి వరకు జనగామ జిల్లా వ్యాప్తంగా సుమారు 60 వేల మంది వృద్ధులు దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్నారన్నారు. వృద్ధులకు రెండేసి చొప్పున మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1.20లక్షల మాస్కులను పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ రామిరెడ్డి, డీపీవో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ మహేందర్‌, జెడ్పీ సీఈవో రమాదేవి, ఆర్డీవో రమేశ్‌, తహసీల్దార్‌ విశ్వప్రసాద్‌, ఎంపీడీవో కుమారస్వామి, ఎంపీపీ కందుల రేఖ, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు టీ సురేశ్‌కుమార్‌, పంచాయతీ ఈవోలు పున్నం శ్రీనివాస్‌, వెంకటకిశోర్‌, ఉప సర్పంచ్‌ నీల ఐలయ్య, ఎంపీటీసీలు ఎస్‌ దయాకర్‌, గన్ను నర్సింహులు, బూర్ల లతాశంకర్‌, బైరి బాలరాజు, చెరిపల్లి రాంమల్లు, తోట సత్యం, గట్టు మనోహర్‌బాబు, డాక్టర్‌ జగన్‌, డాక్టర్‌ కుమార్‌, గట్టు వెంకటస్వామి, చట్ల రాజు పాల్గొన్నారు. అనంతరం మృగశిరకార్తె సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్యకు టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మునిగెల రాజు 10 కిలోల చేపను అందించారు.  

బాధిత కుటుంబాలకు పరామర్శ

స్టేషన్‌ఘన్‌ఫూర్‌/స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌/జఫర్‌ఘడ్‌ : మండల టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు కుంభం రాములు ముదిరాజ్‌(47) అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున మృతిచెందగా  విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాములు మృతదేహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ మారపాక రవి, కుడా డైరెక్టర్‌ ఆకుల కుమార్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు టీ సురేశ్‌కుమార్‌,  ఇనుగాల నర్సింహారెడ్డి, కుంభం కుమారస్వామి,  బూర్ల లతాశంకర్‌,  తోట సత్యం, కుంభం రాజ య్య, బోసు ఐలయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

అలాగే, చిలుపూర్‌ మండలంలోని పల్లగుట్ట గ్రామానికి చెంది న జీడీ తిరుమల గట్టయ్య(80) అనారోగ్యంతో మృతిచెందగా బాధిత కుటుంబాన్ని ఎమ్మె ల్యే రాజయ్య పరామర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బోట్లు మానస, మార్కెట్‌ డైరెక్టర్‌ ఇసురం వెంకటయ్య, సీహెచ్‌ రా జేందర్‌, నలిమెల రజిత, చేరాలు, చొక్క య్య, మర్రి శ్రీధర్‌ పాల్గొన్నారు. జఫర్‌ఘడ్‌ మండలంలోని తమ్మడపల్లి(జి) గ్రా మానికి చెందిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌, రైతు బంధు జిల్లా సభ్యుడు అన్నం బ్రహ్మారెడ్డి తల్లి లక్ష్మి(65) సోమవారం మృతి చెందగా ఎమ్మెల్యే రాజ య్య, జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి  బాధితులను పరామర్శించారు. లక్ష్మి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, తిమ్మంపేటకు చెందిన ఇల్లందుల కనుకయ్య మృతి చెందగా ఆయన అంతిమ యాత్రలో ఎమ్మెల్యే పా ల్గొని బాధితులను పరామర్శించారు. తమ్మడపల్లి(జి)సర్పంచ్‌ అన్నెపు పద్మ, అశోక్‌, మాజీ సర్పంచ్‌ స్వప్న, ప్రభాకర్‌, రంజిత్‌, రాజు, నరేశ్‌, శోభన్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo