బుధవారం 03 మార్చి 2021
Jangaon - Jun 08, 2020 , 04:40:44

జీసీసీ ద్వారా జోరుగా కొనుగోళ్లు

జీసీసీ ద్వారా జోరుగా కొనుగోళ్లు

  • లక్షా ఇరవై ఐదు వేల క్వింటాళ్ల ధాన్యం సేకరణ 
  • రైతులకు అందుబాటులోకొనుగోలు కేంద్రాలు
  • పెరిగిన దిగుబడి.. దళారులకు చెక్‌ 

ఏటూరునాగారం : ఈసారి జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం పెద్ద ఎత్తున సేకరించారు. ఏ టూరునాగారం డివిజన్‌ పరిధిలో ఇప్పటి వర కు 1,25,761 క్వింటాళ్ల ధాన్యం సేకరణ పూర్త యింది. వీటి విలువ రూ. 22.91 కోట్లు ఉం టుందని జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఏటూరునాగారం గిరిజన సహకార సంస్థ(జీసీసీ) డివిజన్‌ పరిధిలోని ఏటూరునా గారం, నర్సంపేట, ములుగు, వెంకటాపురం, నర్సంపేట, మహదేవ్‌పూర్‌లోని జీసీసీ బ్రాం చుల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏటూరునాగారం బ్రాంచి పరిధిలో ఏటూరునాగారం, తాడ్వాయి, మం గపేట, కన్నాయిగూడెం మండలాల్లోని చిన్నబోయినపల్లి, రొయ్యూరు, ఆకుల వారి ఘనపురం, బీరెల్లి, మంగపేట, కోమటిపల్లి, కన్నాయిగూడెం మండలాల్లో ఏర్పాటు చేసిన కేం ద్రాల ద్వారా 37,342 క్వింటాళ్లు, ములుగు బ్రాంచ్‌ పరిధిలోని ములుగు, గోవిందరావు పే ట మండలాల్లోని ములుగు, జంగాలపల్లి, బూ రుగుపేట, కర్లపల్లి, రాఘవపట్నం కేంద్రాల ద్వారా 9034 క్వింటాళ్లు, వెంకటాపురం బ్రాం చ్‌ పరిధిలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లోని వెంకటాపురం, నూగూరు, రాశిపల్లి, చిరుతపల్లి, వాజేడు, జగన్నాథపురం కేంద్రాల నుంచి 8151 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించా రు. మహబూబాబాద్‌ జిల్లాలోని నర్సంపేట బ్రాంచి పరిధిలో కొత్తగూడ, గూడూరు, ఖానాపురం మండలాల్లోని వెలుబల్లి, ఓటాయి, మా చెర్ల, అశోక్‌నగర్‌ కేంద్రాల ద్వారా 11,337 క్వింటాళ్లు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ని మహదేవపూర్‌ బ్రాంచి పరిధిలోని ఆజాంనగర్‌, నిమ్మగూడెం, కనుకునూరు, ముత్తా రం, కోనంపేట, కాటారం కేంద్రాల ద్వారా 10,340 క్వింటాళ్ల ధాన్యం సేకరణ చేపట్టారు. కాగా, జీసీసీ డివిజన్‌ పరిధిలో ఏటూరునాగా రం, ములుగు, మహదేవపూర్‌, వెంకటాపు రం, నర్సంపేట బ్రాంచ్‌ పరిధిలో గత ఖరీఫ్‌లో 39 కేంద్రాల ద్వారా 2324మంది రైతుల నుం చి 1,33,823 క్వింటాళ్ల ధాన్యం సేకరించారు. 

యాసంగిలో పెరిగిన దిగుబడి..

ఈసారి యాసంగిలో పంటల సాగుతోపా టు  దిగుబడి పెరిగింది. ప్రభుత్వం  24 గంట లపాటు ఉచిత కరంటు ఇవ్వడం, అకాల వర్షా లు లేకపోవడంతో దిగుబడి పెరిగినట్లు తెలుస్తోంది. రైతులు దళారులను ఆశ్రయించకుం డా ప్రభుత్వం చర్యలు  చేపట్టింది. కరోనా వైర స్‌ ప్రబలుతున్న నేపథ్యంలో రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తామని రైతన్నకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. దీంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించారు. కొనుగోళ్లు పెరగడం వల్ల జీసీసీకి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. యాసంగిలో పూర్తి స్థాయిలో దళారుల కొనుగోళ్లకు చెక్‌ పడినట్లు అయింది. 

VIDEOS

logo