ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Jun 07, 2020 , 02:49:02

పిల్లర్లతో బ్రిడ్జి నిర్మాణానికి కృషి

పిల్లర్లతో బ్రిడ్జి నిర్మాణానికి కృషి

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

నిర్మాణ పనుల పరిశీలన  

స్టేషన్‌ఘన్‌ఫూర్‌, జూన్‌06 :  డివిజన్‌ కేంద్రంలోని జాతీయ ర హదారి బ్రిడ్జిని పిల్లర్లతో నిర్మించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజయ్య  తాటికొండ రాజయ్య అన్నారు. ఈ మేరకు శనివారం బ్రిడ్జి నిర్మా ణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందొద్దన్నారు. అనంతరం పిల్లర్లతో బ్రిడ్జి ని నిర్మించి పార్కింగ్‌ సమస్య లేకుండా చూడాలని చిరువ్యాపారులు ఎమ్మెల్యే రాజయ్య విజప్తి చేశారు. కార్యక్రమంలో కుడా డైరెక్టర్‌ ఆకుల కుమార్‌, సర్పంచుల ఫోరం మం డల అధ్యక్షుడు సురేశ్‌కుమార్‌, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, మునిగాల రాజు, సింగపురం దయాకర్‌, నాయకులు పార్శికమల్‌, మాతాంగీ దేవయ్య, మారపెల్లి ప్రసాద్‌బాబు, దార భిక్షపతి, గన్ను ప్రభాకర్‌, పి. కుమారస్వామి, కొలిపాక సతీశ్‌, గాదె పృథ్వీ, తోట రమేశ్‌, మునిగాల అంజయ్య, పిట్ట లక్ష్మీనారాయణ, శంకర్‌, సారంగపాణి, బెలెదె రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి పరామర్శ..

మండలంలోని శివునిపల్లికి చెందిన గొలి గౌరీ శంకర్‌రావు(82)శనివారం అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజయ్య మృతిదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. అదే విధంగా మృతుడి నేత్రాలను స్టేషన్‌ఘన్‌పూర్‌, శివునిపల్లి లయన్స్‌క్లబ్‌ కమిటీల ఆధ్వర్యంలో వరంగల్‌ నేత్రవైద్యశాలకు తరలించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు బైరీ బాలరాజు, ఏసుబాబు, పార్శికమల్‌, పార్శి కృష్ణారావు, రామకృష్ణ, లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, కోశాధికారి లయన్‌ రాంకిషన్‌, సభ్యులు గోలి ప్రశాంత్‌, కొంరెల్లి, కృష్ణమూర్తి, గోలి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.  

VIDEOS

logo