ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Jun 06, 2020 , 02:48:57

ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత ఉండాలి

ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత ఉండాలి

ఎంపీడీవో ఎండీ హసీం .. జిల్లాలో ప్రారంభమైన నిర్మాణాలు  

జనగామ రూరల్‌, జూన్‌05: భూగర్భ జలాలు పెంపునకు ప్రతి ఇంట్లో  ఇంకుడుగుంతను నిర్మించుకోవాలని ఎంపీడీవో ఎండీ హసీం అన్నారు. శుక్రవారం మండలంలోని అడవికేశ్వాపూర్‌, ఎల్లంల గ్రామాల్లో ఇంకుడుగుంతల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగించుకున్న నీరు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే గుంతలు నిర్మించుకుని భూగర్భ జలాలు పెంపునకు కృషి చేయాలన్నారు. ఇప్పటి వరకు ఇంకుడుగుంతలు నిర్మించుకోని వారు వెంటనే నిర్మించుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శంకర్‌రావు, సర్పంచులు బానోత్‌ జయరాం, ఎర్ర సుజాత, ఎంపీవో సంపత్‌కుమార్‌, ఏపీవో చిక్కుడు భిక్షపతి, టీఏ అనిల్‌, పంచాయతీ కార్యదర్శి శివశంకర్‌, ముప్పడి రాజు, తదితరులు పాల్గొన్నారు.  

దేవరుప్పులలో..

దేవరుప్పుల:  మండల వ్యాప్తంగా శుక్రవారం ఇంకుడు గుంతల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.  ఈ సందర్భంగా ఎంపీడీవో అనిత మాట్లాడుతూ మండల వ్యాప్తం గా 3వేల ఇంకుడు గుంతలు నిర్మించాలనే లక్ష్యంతో  ముందుకెళ్తున్నామన్నారు. కాగా,  ధర్మాపురం, పడమటి తండాలో ఎంపీపీ బస్వ సావిత్రి ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ప్రారంభించారు.  కార్యక్రమంలో ఎంపీడీవో అనిత, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ కృష్ణమూర్తి, ధర్మాపురం సర్పంచ్‌ అశోక్‌, పడమటి తండా సర్పంచ్‌ కంస్యా, ఎంపీటీసీ ఉపేందర్‌ పాల్గొన్నారు.  

తరిగొప్పులలో..

తరిగొప్పుల : మండల వ్యాప్తంగా శుక్రవారం ఇంకుడుగుంతల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఖనిలకుంట గ్రామంలో ఎంపీడీవో కృష్ణకుమారి పనులను ప్రారంభించారు.  కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రామరావు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ శ్రీజ,  కారోబార్‌ సిద్దిరాములు, తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo