చివరి ఆయకట్టుకూ గోదావరి జలాలు

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
జనగామ రూరల్, జూన్ 5 : నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకూ గోదావరి జలాలు అందిస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని మరిగడి, పెద్దతండా(ఎం) గ్రామాల్లోకి వస్తున్న గోదావరి జలాలను శుక్రవారం కాలువ వెంబడి తిరిగి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం గోదావరి జలాలు వస్తుండడంతో కరువు నేల పచ్చని పైర్లతో కళకళలాడుతోందన్నారు. గతంలో నీళ్ల మంత్రిగా పని చేసిన పొన్నాల లక్ష్మయ్య ఇక్కడి రైతులను పట్టించుకోలేదన్నారు. పొన్నాల జనగామకు నీటి శనీశ్వరుడన్నారు. గోదావరి జలాలు రావడంతో పెద్దతండా(ఎం) రైతులు సం తోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తమ గ్రామాలకు గోదావరి జలాలు తీసుకురావడం జీవితంలో మరిచిపోమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కలింగరాజు, టీఆర్ఎస్ మండల కార్యదర్శులు శ్రీనివాస్, స్వామి, సర్పంచ్ రజిత, సాంబరాజు, శివయ్య, బాలకృష్ణ, రంజిత్, రాజు, యాదగిరి పాల్గొన్నారు.
తాజావార్తలు
- 15 ఏండ్ల తర్వాత ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత
- ఉప్పెన దర్శకుడి రెండో సినిమా హీరో ఎవరో తెలుసా?
- నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ‘మహా’ నమూనాలు
- ఇండో-పాక్ సంబంధాల్లో కీలక పరిణామం.. మళ్లీ చర్చలు షురూ!
- రెచ్చిపోయిన పృథ్వీ షా.. మెరుపు డబుల్ సెంచరీ
- కఠిక పేదరికాన్ని నిర్మూలించాం.. ప్రకటించిన చైనా అధ్యక్షుడు
- కళ్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు
- షాకింగ్ : పక్కదారి పట్టిందనే ఆగ్రహంతో భార్యను హత్య చేసి..
- క్రికెట్లో ఈయన రికార్డులు ఇప్పటికీ పదిలం..
- పవన్ కళ్యాణ్‌తో జతకట్టిన యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్