మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Jun 06, 2020 , 02:36:44

అల్లంతో సిరులు

అల్లంతో సిరులు

అయితే వరి, లేదంటే పత్తి, తప్పదనుకుంటే మిర్చి, మక్క వేసే మూస ధోరణిని వీడిన ఆ రైతు వినూత్నంగా ఆలోచించాడు. ‘క్షేత్రమెరిగి విత్తనం’ వేశాడు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న అల్లం పండించి లాభాలు పొందుతున్నాడు నల్లబెల్లి మండలం వేదనగర్‌కు చెందిన రైతు రఘోత్తం రెడ్డి. సేంద్రియ ఎరువులు వాడుతూ భూమిలో జవసత్వాలు నింపుతున్నాడు. ఆయన్ను ఆదర్శంగా తీసుకున్న మరికొందరు రైతులు సరికొత్త సాగుకు సిద్ధమయ్యారు. -నర్సంపేట 


 అంతర పంటగా సాగు

 సేంద్రియ పద్ధతిలో సేద్యం 

 ఎకరాకు వంద క్వింటాళ్ల దిగుబడి

 రూ. 5 లక్షలు రాబడి

 విత్తనోత్పత్తికి ప్రాధాన్యం

 ఇతర రైతులకు విక్రయం

 మూడేళ్లుగా రాణిస్తున్న నల్లబెల్లి మండలం వేదనగర్‌ రైతు

రఘోత్తం రెడ్డికి 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో బావులు, బోర్ల ఆధారంగా పండ్ల తోటలు సాగు చేస్తున్నాడు. అరటి, బొప్పాయి, మామి డి, బత్తాయి, సపోట, సీతాఫలంలో చెట్ల మధ్య మూడేళ్లుగా అంతర పంటగా అల్లం వేస్తున్నాడు. మొ దట ఆశించిన దిగుబడి రాలేదు. అయినా కుంగి పోకుండా మేలైన విత్తనం కోసం అన్వేషించాడు. కేరళ రాష్ట్రం వెళ్లి ‘మారన్‌', ‘మహిమ’ అనే వెరైటీలను పరి శీలించాడు. అవి బాగుండడంతో తీసుకొచ్చాడు. మొద టి ఏడాది కంది పంటలో అంతరపంటగా, రెండో ఏడా దిలో విడిగా, మూడో ఏడాదిలో బొప్పాయి తోటలో అంతర పంటగా అల్లం సాగు చేసి, అధిక లాభాలు పొందాడు.

సేంద్రియ పద్ధతిలో సాగు..

నర్సంపేట ప్రాంతంలో రైతులు ఎక్కువగా మిర్చి, పత్తి, మక్క సాగు చేస్తారు. కానీ, రఘోత్తం రెడ్డి కొత్తగా ఆలోచించాడు. పట్టుదలతో పది ఎకరాల్లో అల్లం సాగుకు శ్రీకారం చుట్టాడు. భూమిని దున్నే సమయం లో పై పాటుగా గొర్రె, కోడి, పశువుల ఎరువులను వేస్తున్నాడు. రెండు వర్షాలు పడ్డ తర్వాత డ్రిప్‌కు అను కూలంగా బోజలు తోలి ఎకరాకు ఏడున్నర క్వింటాళ్ల అల్లం విత్తుతున్నాడు. దుంపకుల్లు, లద్దెపురుగు ఆశించకుండా సేంద్రియ కషాయాలు వాడుతున్నాడు. అల్లం వేసిన 20 రోజుల నుంచి 40 రోజుల వరకు మొలకెత్తుతాయి. 22 రోజుల్లో కలుపుమందు చల్లుతున్నాడు. ఎనిమిది నుంచి రెండేళ్ల మధ్యలో మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న సమయంలో తవ్వి విక్రయిస్తున్నాడు.  

విత్తనాలకు విక్రయం..

రఘోత్తంరెడ్డి పండించిన అల్లాన్ని చుట్టుపక్కల రైతులకు విత్తనాల కోసం  విక్రయిస్తున్నాడు. మిగతాది హైదరాబాద్‌లోని ఉస్మాన్‌గంజ్‌కు తరలిస్తున్నాడు. ఎకరంలో అల్లం (కొమ్ములు) విత్తడానికి ఏడున్నర క్వింటాళ్లు అవసరం పడుతుంది. క్వింటాలుకు రూ. 8 వేల చొప్పున ఎకరాకు రూ.60 వేలకు వరకు విత్తనం ఖర్చు, ఎరువులు, కలుపు నివారణకు మరో రూ. 60 వేలు, మొత్తం రూ.1.20 లక్షలు ఖర్చు వస్తోంది. ఎక రాకు 100 క్వింటాళ్ల అల్లం పండుతోంది. ఉమ్మడి జిల్లా రైతులు అల్లం విత్తనాలను రూ. 8 వేలకు క్వింటా ల్‌ చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌కు తర లించి విక్రయిస్తే రూ.5 వేల ధర పలుకుతోంది. అల్లం పంట కాలం ఎనిమిది నెలల నుంచి ఏడాది. ఎకరంలో రూ.1.20 లక్షల పెట్టుబడి పెట్టి, వచ్చిన పంటను రైతులకు విత్తనాల రూపంలో విక్రయిస్తే రూ. 8లక్షలు వస్తుండగా, మార్కెట్‌లో విక్రయిస్తే రూ. 5లక్షలు వస్తున్నాయి. వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో రైతులు రఘోత్తంరెడ్డి నుంచి విత్తనాలు కొనుగోలు చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ సదస్సులో రఘోత్తంరెడ్డిని రూరల్‌ జిల్లా కలెక్టర్‌, అధికారులు అభినందించారు.

VIDEOS

logo