పనులు చేయనప్పుడు

పాలకమండళ్లు ఎందుకు?
సర్పంచ్, ఉపసర్పంచ్ వైఖరిపై కలెక్టర్ ఆగ్రహం
డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక నిర్మాణాలను మొదలుపెట్టి నివేదికలు పంపించాలని ఆదేశం
లేనిపక్షంలో సస్పెన్షన్ తప్పదని హెచ్చరిక
గ్రామాల్లో మౌలిక వసతుల పరిశీలన
రాయపర్తి, జూన్ 4: గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేనప్పుడు అక్కడ పాలకమండళ్లు ఎందుకని రూరల్ జిల్లా కలెక్టర్ హరిత ప్రశ్నించారు. పగలు, ప్రతీకారాలతో గ్రామాలను అంధకారాల్లోకి నెట్టవద్దని సూచించారు. పలు గ్రామాలను ఆమె గురువారం సందర్శించారు. ఊకల్‌లో పాదయాత్ర నిర్వహించారు. డంపింగ్ యార్డు, శ్మశానవాటిక నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయని సర్పంచ్ కుంచారపు హరినాథ్‌ను కలెక్టర్ ప్రశ్నించారు. వాటి నిర్మాణ పనులను ప్రారంభించలేదని, ఉపసర్పంచ్ బైరి యాకయ్య తన అనుచరులతో కలిసి అభివృద్ధి పనులకు అడ్డుతగులుతున్నాడంటూ సర్పంచ్ ఆరోపించారు. వెంటనే ఉపసర్పంచ్‌ను ప్రశ్నించగా అతడు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలు, ప్రతీకారాలతో గ్రామాలను అభివృద్ధికి దూరంగా ఉంచడం సరికాదని, రెండు రోజుల్లో డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి తనకు నివేదికలు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. లేదంటే సర్పంచ్, ఉపసర్పంచ్‌ను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. కలెక్టర్ పానీష్తండా గ్రామ పంచాయతీని సందర్శించి, నర్సరీని పరిశీలించారు. మొక్కలు పెంచుతున్న తీరుతెన్నులు, సంరక్షణ కు చేపడుతున్న కార్యక్రమాలు చూసి సర్పంచ్ భూక్య భద్రూనాయక్‌ను అభినందించారు. సన్నూరులో పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. చెత్తను ఒక్కచోట వేసి కాలుస్తుండగా గుర్తించి, సూచనలిచ్చారు. చెత్తను కాల్చేందుకు ప్రోత్సహించిన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.
24 గంటలూ వైద్యం అందాలి
పీహెచ్సీలో 24 గంటలపాటు వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్‌వో మధుసూదన్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలోని రికార్డులు, అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది, అందుతున్న వైద్య సేవలను ఆమె పరిశీలించారు. పీహెచ్సీ ఆవరణలో నూతనంగా ఇంకుడు గుంతలు, మొక్కలు నాటించేందుకు ఏర్పాట్లు చేయాలని సర్పంచ్ గారె నర్సయ్య, మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య వెంకటేశ్‌ను ఆదేశించారు. రోగులకు మాస్కులు పంపిణీ చేశారు. ఆమె వెంట డీపీవో రాజారావు, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్‌రావు, మండల ప్రత్యేకాధికారి నరేశ్‌కుమార్ నాయుడు, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో రామ్మోహనాచారి, ఎంపీవో రామ్మోహన్, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్, డిప్యూటీ తహసీల్దార్ రాజ్‌కుమార్, నలమాస సారయ్య, రాజు, జన్ను అనిల్‌కుమార్, రాంచం దర్, నెహ్రూచంద్ నాయక్ తదితరులున్నారు.
తాజావార్తలు
- గల్వాన్‌లో మనపై దాడిచేసిన చైనా కమాండర్‌కు అత్యున్నత పదవి
- మోదీ స్టేడియంలో కోహ్లీసేన ప్రాక్టీస్: వీడియో
- ఆ టీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు తెలుసా..!
- జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
- విద్యార్థులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి
- ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్‌లోకి ఎస్బీఐ?.. అందుకే..!
- ‘బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడటమే మా ప్రాధాన్యత’
- న్యాయవాద దంపతుల హత్యకు వాడిన కత్తులు లభ్యం
- తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తాం : అసదుద్దీన్ ఒవైసీ
- ప్రచార పర్వం : టీ కార్మికులతో ప్రియాంక జుమర్ డ్యాన్స్