సోమవారం 06 జూలై 2020
Jangaon - Jun 03, 2020 , 03:30:36

జనగామలో రాష్ట్ర అవతరణ సంబురం

జనగామలో రాష్ట్ర అవతరణ సంబురం

 క్యాంపు కార్యాలయంలో   జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

జనగామ, జూన్‌ 02 : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జిల్లా కేంద్రంలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఆరేళ్ల స్వపరిపాలనను పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిరాడంబరంగా జరిగిన కార్యక్రమాలు తెలంగాణ వైభవాన్ని ప్రతిబింబించాయి. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

జిల్లా పరిషత్‌ కార్యాలయంపై జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ పోకల జమున లింగయ్య, ఆర్డీవో కార్యాలయంలో మధుమోహన్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో ప్రథమశ్రేణి కార్యదర్శి జీవన్‌కుమార్‌, జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో అధ్యక్షులు కృష్ణారెడ్డి జెండా ఆవిష్కరించి ఆరేళ్ల పాలన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, రాజకీయ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. తెలంగాణ జాగృతి జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు పసునూరి మురళీ జెండా ఆవిష్కరించగా, అధికార ప్రతినిధి చిదురాల రాజు, యూత్‌ జిల్లా అధ్యక్షుడు నారగోని రవిచంద్ర, పట్టణ అధ్యక్షుడు సాజిద చింటు పాల్గొన్నారు. 


ఊరూరా అవతరణ వేడుకలు..

జనగామ రూరల్‌ : మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మేకల కళింగరాజుయాదవ్‌ జెండా ఆవిష్కరించారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, హెచ్‌ఎంలు పాల్గొని జెండాలు ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల అధ్యక్షులు జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలు గ్రామాల్లో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో ఎండీ హసీం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు బొల్లం శారద, ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షురాలు బండ లక్ష్మీవెంకటేశం, ఎంపీ వో సంపత్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

బచ్చన్నపేటలో..

బచ్చన్నపేట : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాలను ఎగురవేశారు. తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతికృష్ణంరాజు, ఎస్సై రఘుపతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, బచ్చన్నపేట గ్రామశాఖ అధ్యక్షుడు నరేందర్‌, డాక్టర్‌ ఆశాదేవి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పులిగిళ్ల పూర్ణచందర్‌, సెంట్రల్‌ బ్యాంకు మేనేజర్‌ శ్రీశైలం, ఏపీజీవీబీ మేనేజర్‌ బుజ్జిబాబుతోపాటు అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచులు మల్లారెడ్డి, సతీశ్‌రెడ్డి, బాల్‌రెడ్డి, భవానీ, మంజుల, తార, మల్లేశం, కవిత, దివ్య, సునితగౌడ్‌, స్వామి, మధుప్రసాద్‌, ఐలయ్య, రాజు, రమేశ్‌, లక్ష్మి, మాధవి, రవీందర్‌రెడ్డి, మంజుల, ఖలీల్‌బేగం, పరుశరాములు, సుశీల, వెంకట్‌గౌడ్‌, కరుణాకర్‌రెడ్డి, రజిత జెండాలను ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీవైస్‌చైర్‌పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మిఅంజయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు గిరబోయిన అంజయ్య, కృష్ణంరాజు, చల్లా శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

తరిగొప్పులలో..

తరిగొప్పుల : మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ మండలశాఖ అధ్యక్షుడు పింగిళి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో గ్రామశాఖ అధ్యక్షులు జెండాలను ఆవిష్కరించారు. ఎంపీపీ జొన్నగోని హరిత, జెడ్పీటీసీ పద్మజా, డీసీసీబీ డైరెక్టర్‌ కేశిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ చెన్నూరి ప్రమీల, రైతు బంధు సమితి అధ్యక్షుడు భూక్య జుమ్‌లాల్‌, ఎంపీటీసీ మంగ, సర్పంచ్‌ ప్రభుదాస్‌ నాయకులు అర్జుల సంపత్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, చిలువేరు లింగం,    గ్రామశాఖ అధ్యక్షుడు రాజారాం, సారయ్య, రాజయ్య, చెన్నూరి సంజీవ, నాగరాజు, రమేశ్‌, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తహసీల్దార్‌ ఎండీ ఫరీదుద్దీన్‌, ఎస్సై హరిత, ఏపీఎం కుమార్‌ జెండాను ఆవిష్కరించారు. 

దేవరుప్పులలో..

దేవరుప్పుల : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల ఎదుట జాతీయ జెండాలను ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ స్వప్న, ఎంపీపీ బస్వ సావిత్రి, ఎస్సై రామారావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు తీగల దయాకర్‌, సర్పంచులు, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖల అధ్యక్షులు వేడుకల్లో పాల్గొని జెండాలను ఎగురవేశారు. మండల కార్యాలయాల సముదాయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పూల మొక్కలు నాటారు. ఎంపీపీ బస్వ సావిత్రితోపాటు ఎంపీడీవో స్వప్న, తహసీల్దార్‌ స్వప్న, కామారెడ్డిగూడెం సర్పంచ్‌ అంజమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ రమేశ్‌రెడ్డి, ఎంపీ వో హరిప్రసాద్‌, ఏపీవో శ్రీనివాస్‌, ఉమామహేశ్వర్‌లు 50పూల మొక్కలను నాటారు. కార్యక్రమాల్లో  సుందరాంరెడ్డి, మల్లేశ్‌, రవి తదితరులు పాల్గొన్నారు. 

లింగాలఘనపురంలో..

లింగాలఘనపుం : లింగాలఘనపురం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎస్సై సంతోషం రవీందర్‌, విండో అధ్యక్షుడు మల్గ శ్రీశైలం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్‌, పీహెచ్‌సీలో డాక్టర్‌ కరుణాకర్‌రాజు, సర్పంచ్‌ సాదం విజయమనోహర్‌ జాతీయ జెండాలను ఎగుర వేశారు.  ఎంపీడీవో సురేందర్‌, ఎంపీటీసీ కేమిడి భిక్షపతి, నాయకులు కేమిడి కవితావెంకటేశ్‌, కేమిడి యాదగిరి, ఉడుగుల భాగ్యలక్ష్మి, కారంపురి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


logo