శనివారం 11 జూలై 2020
Jangaon - Jun 03, 2020 , 03:30:34

మానుకోటను మాగాణి కోటగా మార్చుకుందాం

మానుకోటను మాగాణి కోటగా మార్చుకుందాం

60 ఏండ్లలో జరుగని అభివృద్ధి ఆరేళ్లలో జరిగింది

రాష్ట్ర అవతరణ వేడుకలో గిరిజన, స్త్రీ శిశు 

సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్‌, జూన్‌02 : మానుకోటను మాగాణి కోటగా మార్చుకుందామని గిరిజన, స్త్రీ శిశు, సంక్షేమ శాఖ మంత్రి 

సత్యవతి రాథోడ్‌ అన్నారు. మంగళవారం రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు 

ముందు జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగో తు బిందు, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే 

బానోత్‌ శంకర్‌నాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డితో కలిసి కోర్టు ఎదుట ఉన్న అమరవీరుల 

స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో జెండా అవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ప్రాణాన్ని ఫణం గా పెట్టి కేసీఆర్‌ 

స్వరాష్ర్టాన్ని సాధించారన్నారు. 60 ఏళ్ల సమైక్య పాలనలో జరగని ప్రగతి ఆరేళ్లలో జరిగిందన్నారు. ఆత్మహత్యల 

తెలంగాణ నుంచి ఆత్మగౌరవ తెలంగాణగా మార్చి ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత సీఎం కేసీఆర్‌ అన్నారు. బీడు 

వారిన భూముల్లో పచ్చ ని పసిడి పండేలా నీటి వసతి కల్పించిన మహానుభావుడు సీఎం అని కొనియాడారు. ఐటీ, 

పారిశ్రామిక రంగాల్లోనూ తెలంగాణను మేటిగా మార్చారన్నారు. కరోనా వైరస్‌ కట్టడిలో జిల్లా వైద్యశాఖ, రెవెన్యూ, 

పోలీసు, పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం అన్నారు. ప్రభు త్వం అమలు చేసే ప్రతి పథకం ప్రజలకు 

అందేలా కృషి చేస్తు న్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.


logo