శనివారం 04 జూలై 2020
Jangaon - Jun 03, 2020 , 03:07:47

జనగామ విద్యార్థులకు రాష్ట్రస్థాయి అవార్డు

జనగామ విద్యార్థులకు రాష్ట్రస్థాయి అవార్డు

  • గవర్నర్‌ తమిళి సై చేతుల మీదుగా అందజేత

జనగామ క్రైం, జూన్‌ 02: కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ నేపథ్యంలో తెలం గాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల విద్యార్థులకు కథలు, కవితలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి అవార్డులను సొంతం చేసుకున్నారు. చిలుపూరు మండలం పల్లగుట్టకు చెందిన జీడి రమేశ్‌ (కథల విభాగంలో )పారిశుధ్య కార్మికులపై రాసిన.. ‘అరవై ఏండ్ల ఏడుపు’ రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం పొందింది. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని జర్నలిస్ట్‌ కాలనీకి చెందిన గుడికందుల తేజ  రాసిన  వ్యాసం తృతీయ బహుమతిని పొందింది. ఈ నేప థ్యంలో రమేశ్‌కు రూ. 10 వేల నగదు, తేజకు రూ. 5వేల నగదుతో పాటు మెమెంటో, ప్రశంసాపత్రాలను మంగళవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై అందజేశారు.   జిల్లా వాసులకు అవార్డులు రావడంపై కవులు, కళాకారులతో పాటు కాసుల లింగారెడ్డి, పెట్లోజు సోమేశ్వర చారి, రెడ్డి రత్నాకర్‌ రెడ్డి, జోగు అంజయ్య, కోడం కుమారస్వామి, సాధిక్‌ అలీ, సాంబరాజు యాదగిరి, నక్క సురేష్‌, నిమ్మ రాంరెడ్డి, తాళ్లపల్లి లక్ష్మణ్‌ గౌడ్‌, పొట్టబత్తిని భాస్కర్‌, కన్నారపు పరశురాములు, చిప్పలపల్లి అవిలయ్య, రాగల్ల ఉపేందర్‌, యాదయ్య, ప్రభాకర్‌, జగధీశ్వరచారి, జనార్ధన్‌, సాయికుమార్‌, అభిషేక్‌, బాలాజీ, శ్రీనివాస్‌, పవన్‌ హర్షం వ్యక్తం చేశారు.logo