శనివారం 11 జూలై 2020
Jangaon - May 31, 2020 , 03:07:04

జనగామ జిల్లాలో 12 వేల మెట్రిక్‌ టన్నుల చేపల దిగుబడి

జనగామ జిల్లాలో 12 వేల మెట్రిక్‌ టన్నుల చేపల దిగుబడి

జనగామ: జిల్లాలో మ హిళలు, పురుషులకు వేర్వేరు సొసైటీలున్నాయి. మొత్తం 150 సొసైటీలు ఉండగా.. 127 పురుష, 23 మహిళా సొసైటీలున్నాయి. ఈ ఏడాది 444 చెరువులు, 9 రిజర్వాయర్లలో 221.39 లక్షల చేప పిల్లల్ని వదిలారు. ప్రస్తుతం అవి పెరిగాయి. మొత్తం 12 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కిలోకు రూ.80 చొప్పున అమ్మితే రూ.96 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొంటున్నారు. చేపలు అమ్మడం కోసం జిల్లాలో 1762 మంది కార్మికులకు సబ్సిడీపై ద్విచక్ర వాహనాల్ని పంపిణీ చేశారు. జిల్లా నుంచి చేపలను హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌, రాంనగర్‌ మార్కెట్‌కు తరలిస్తుంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా మార్కెటింగ్‌ విషయంలో కార్మికులు తర్జనభర్జన పడుతున్నారు. జిల్లాలోని జఫర్‌ఘడ్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌, అశ్వరావుపల్లి, రామారం, నెల్లుట్లలో చేపల దిగుబడి పెరిగింది. కొన్ని చోట్ల కార్మికుల చేపల్ని పట్టి విక్రయిస్తున్నారు. ఈ నెల చివరి వరకు పూర్తిస్థాయిలో అమ్మే అవకాశాలు ఉన్నాయని జనగామ జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి తెలిపారు. 


logo