శనివారం 04 జూలై 2020
Jangaon - May 28, 2020 , 02:23:38

వలస కార్మికులపై ప్రత్యేక దృష్టి

వలస కార్మికులపై ప్రత్యేక దృష్టి

  • డీఎంహెచ్‌వో మహేందర్‌

పాలకుర్తి రూరల్‌ మే 27: వలస కార్మికులకు కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో వారిపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా వైద్యాధికారి ఏక్కలదేవి మహేందర్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేశారు. వలస కార్మికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 3, 300మంది వలస కార్మికులు వచ్చారన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులకు దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్య సిబ్బందికి తెలుపాలన్నారు.   మండలంలో ఇద్దరు వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించామన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు నిరంతరం అందుబాటులో ఉండి వలస కార్మికుల వివరాలు సేకరించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలు కరోనాపై జాగ్రత్తగా ఉండాలన్నారు. మాస్కులు లేకుండా బయట తిరగొద్దన్నారు. వైద్య సిబ్బంది విధుల్లో  నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో రామునాయక్‌, తహసీల్దార్‌ ఎన్‌ విజయభాస్కర్‌, వైద్యాధికారి జి. యామిని, టి. ప్రియాంక, స్పందన, నాగరాజు, చందర్‌, లక్ష్మీబాయి, అరుణ, మంజుల రాణి, ఫర్వీన్‌ సుల్తానా, విజయ, వనజ ఉన్నారు.


logo