శనివారం 04 జూలై 2020
Jangaon - May 28, 2020 , 02:14:25

రాజీవ్‌ గృహకల్ప ఇళ్లను పేదలకు అందజేస్తాం

రాజీవ్‌ గృహకల్ప ఇళ్లను పేదలకు అందజేస్తాం

  • ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ 

వరంగల్‌/కరీమాబాద్‌/మిల్స్‌కాలనీ, మే 27: అసంపూర్తిగా ఉన్న రాజీవ్‌ గృహకల్ప ఇళ్లను పూర్తి చేసి అర్హులైన పేదలకు అందజేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. బుధవారం 23వ డివిజన్‌లోని రాజీవ్‌ గృహకల్ప ఇళ్లతోపాటు 4వ డి విజన్‌ దూపకుంటలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను జిల్లా కలెక్టర్‌ రాజీ వ్‌గాంధీ హన్మంతుతో కలిసి ఎమ్మెల్యే నరేందర్‌ పరిశీలించారు.  ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజీవ్‌ గృహకల్ప నిర్మాణాలకు రూ. 10.34 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. దసరా నాటికి పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామ ని చెప్పారు. దూపకుంటలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను దసరా నాటికి అందించడమే లక్ష్యంగా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్లు కత్తెరశాల వేణుగోపాల్‌, బిల్ల కవిత, రిజ్వానా షమీమ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మీరిపెల్లి వినయ్‌, శ్రీకాంత్‌, మసూద్‌,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమస్యలను పరిష్కరించాలి

ఖిలావరంగల్‌ పడమర కోట మీదుగా  ఇన్నర్‌రింగ్‌ నిర్మాణం లో  భూములు కోల్పోతున్న రైతులకు త్వరగా నష్ట పరిహారం  చెల్లించాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డిని కోరారు. బుధవారం రైతులు ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించారు. దీంతో కుడా కార్యాలయంలో చైర్మన్‌ను కలిసి రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోయారు. అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కుడా చైర్మన్‌ తెలిపారు.logo