శనివారం 06 జూన్ 2020
Jangaon - May 21, 2020 , 00:04:15

సొంతూళ్లకు వలస కూలీలు

సొంతూళ్లకు వలస కూలీలు

  • సొంత ఊళ్లకు బైలెల్లిన ఉత్తరప్రదేశ్‌ కు చెందిన వలస కూలీలు
  • ప్రత్యేక బస్సుల్లో సాగనంపిన అధికారులు

జనగామ క్రైం/పరకాల/పరకాల టౌన్‌/మహబూబాబాద్‌: పొట్ట చేతపట్టుకొని భార్యాబిడ్డలతో కలిసి బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలు బరువెక్కిన హృదయంతో సొంత గూటికి బైలెల్లారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 43 మంది వలస కార్మికులు కొంత కా లం నుంచి జనగామ జిల్లా కేంద్రంలో మగ్గం, ఎంబ్రాయిడరీ వర్క్‌, జిన్నింగ్‌ మిల్లు కార్మికులుగా పనిచేస్తూ జీ వనం సాగించేవారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో బుధవారం వీరంతా తమ సొంతూళ్లకు పయనమయ్యా రు. చర్లపల్లి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గొండ (గోండ్వాన) జిల్లా వరకు బుధవారంరాత్రి 10 గంటలకు వెళ్లే ప్రత్యేక శ్రామిక్‌ రైలులో వీరిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందులో భాగంగా వీరందర్నీ జనగామ జిల్లా కేంద్రం నుంచి చర్లపల్లి రైల్వేస్టేషన్‌ వరకు తరలించడానికి ఎల్‌ శ్రీనివాస్‌రెడ్డి అనే దాత సహాయంతో ప్రత్యేక బస్సును పోలీసులు ఏర్పాటు చేశారు. అనంతరం స్థానిక ప్రెస్టన్‌ స్కూల్‌ ఆవరణలో వలస కార్మికులను ఒక చోట చేర్చి, జనగామ ఏసీపీ ఎస్‌ శ్రీకాంత్‌, జిల్లా సంక్షేమ అధికారి జ్యోతిపద్మ ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. పోలీసు సిబ్బంది కార్మికులకు అరటి పండ్లు, వాటర్‌ బాటి ల్స్‌ ఇవ్వగా, జిల్లా సంక్షేమ అధికారి కార్మికులకు డెటాల్‌ సబ్బులు, బిస్కెట్‌ ప్యాకెట్లను అందజేశారు. అధికారులు దగ్గరుండి బస్సులో సాగనంపడంతో కార్మికులంతా తెలంగాణ పోలీస్‌ జిందాబాద్‌ అంటూ తమ హర్షాతిరేకాలను వ్యక్తపర్చారు. కార్యక్రమంలో జనగామ ఏసీపీ ఎస్‌ శ్రీకాం త్‌, జిల్లా సంక్షేమ అధికారి జ్యోతిపద్మ, చిన్నపిల్లల సంక్షేమ అధికారి ఎల్‌ రవికాంత్‌, అర్బన్‌ సీఐ డీ మల్లేశ్‌ యాదవ్‌, ఎస్సై సీహెచ్‌ రవి కుమార్‌, ఎండీ సలీం, సురేశ్‌ పాల్గొన్నా రు. అదేవిధంగా పరకాలలో ఏసీపీ శ్రీనివాస్‌ నేతృత్వంలో పోలీసులు పట్టణంలో ఉంటున్న ఉత్తరప్రదేశ్‌లోని గోండా, ఫిజాబాద్‌, మేయు ప్రాంతాలకు చెందిన 20 మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు.  ఈ బస్సును ఏసీపీ జెండా ఊ పి ప్రారంభించారు. బస్సులో వలస కార్మికుల వెంట హోంగార్డు ఆఫీసర్‌ శివప్రసాద్‌ను తోడుగా పంపించారు. కార్యక్రమంలో సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సై శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

మహబూబాబాద్‌కు వచ్చిన కూలీలు

అలాగే కర్ణాటక నుంచి మహబూబాబాద్‌కు వచ్చిన వలస కార్మి కులకు వైద్య పరీక్షలు నిర్వహించి, జాగ్రత్తగా వారి స్వగ్రామాలకు చేర్చేందుకు తగిన ఏర్పాట్లు చేయా లని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్‌ జిల్లా నుంచి కర్ణాటక వలస వెళ్లి లాక్‌డౌన్‌ సమయంలో అక్కడే చిక్కుకున్న  కార్మికులు స్వరాష్ర్టానికి తీసు రావడానికి సహకరించాలని మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వా రా విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్‌కు చెందిన వలస కూలీలు కావడంతో మంత్రి సత్యవతి కి కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి వలస కార్మికులను జిల్లాకు తిరిగి రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో మహబూబాబాద్‌, కేసముద్రం, గూడురూలోని వివిధ గ్రామాలకు చెందిన 50 మంది కార్మికులు కర్ణాటకలోని ఉడిపి నుంచి బస్సుల ద్వారా జిల్లాకు చేరు కోగా అధికారులు ఘన స్వాగతం పలికారు. 


logo