సోమవారం 01 జూన్ 2020
Jangaon - May 20, 2020 , 01:13:38

ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌కుభూ సేకరణ!

ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌కుభూ సేకరణ!

  • వివాదరహిత భూమి అన్వేషణకు సర్కారు ఆదేశం
  • ముప్పారంలోని స్థలాల పై అధికారుల ఆరా!
  • రైలు మార్గానికి సమీపంలో ఉండాలని నిర్ణయం
  • 23న ప్రభుత్వానికి నివేదిక అందించనున్న జిల్లా యంత్రాంగం

వరంగల్‌ ప్రతినిధి-నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం గా కొత్త వ్యవసాయ విధానాన్ని రూపకల్పన చేస్తుంది. అందులో భాగంగా ప్రతి జిల్లాలో నూ ఆయా జిల్లా పంటల సాగు నేపథ్యం, ఆ పంటల ద్వారా వచ్చిన దిగుమతుల్ని జిల్లా అవసరాలకు పోను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే విధంగా ఉండే శాశ్వత ఏర్పా టు చేయాలని సంకల్పించింది.  ఏ జిల్లాకు ఆ జిల్లా స్వయం సమృద్ధిని సాధించడమే కాకుండా ఆ జిల్లాలో అయిన ఉత్పత్తి కారకాలు, ఆ జిల్లా అవసరాలకు పోను మిగిలిన ప్రాంతాలకు సరఫరా చేయాలి? అన్న విషయంలో సర్కార్‌ స్పష్టమైన మార్గదర్శకాలతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌  జిల్లాకో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసేందు కు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలం ఎక్కడుంది?  ఎంత ఉంది? రవాణా, ప్రయాణ సదుపాయం ఎట్లా ఉం ది? ఆ గుర్తించిన స్థలానికి రైల్‌ మార్గం ఎంత దూరంలో ఉన్నది? రోడ్డు మార్గం ఏ దిశలో ఉన్నది వంటి అనుకూలతల్ని గుర్తించి ప్రభుత్వానికి ఈ నెల 23 లోగా నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ధర్మసాగర్‌ మండలంలోని ముప్పారం గ్రామంలో అందుబాటులో ఉ న్న స్థలాన్ని పరిశీలించారు. ఈ గ్రామంలో దాదాపు 35 సర్వే నంబర్లలోని 208 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. వివిధ సర్వే నంబర్లలో 30 గుంటల నుంచి 14.16 ఎకరాల దాకా వివిధ సర్వే నెంబర్లలో భూమిని గుర్తించారు. ఇందులో దాదా పు 41 ఎకరాల స్థలాన్ని (40.39ఎకరాలు) భూమిని గతంలోనే ప్రభుత్వం సేకరించింది. మిగిలిన భూమిలో కొంత అటవీభూమి ఉందని, ఎక్కువగా ప్రైవేట్‌ పట్టాభూమిగా రికార్డులో ఉందని తెలుస్తున్నది.  ఇలా గుర్తించిన భూమిని మ్యాపింగ్‌ చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను సాధ్యమైనంత తొందరలో ప్రారంభించే ప్రక్రియ మొదలుపెట్టాలనేది ప్రభుత్వ లక్ష్యం కనుక సాధ్యమైనంత మేర కు వివాద రహిత భూమి ఉంటేనే మంచిదని ప్రభు త్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చే యడంతో అందుబాటులో ఉన్న ఈ రెండు వందల ఎకరాల భూమి, వివిధ సర్వే నంబర్లలో  ఉన్నప్పటికి ఈ సర్వే నెంబర్‌లో అయి నా లోగడ కానీ, ఇప్పుడు కానీ ఏదైనా వివాదాస్ప భూ మి ఉన్నదా? అన్న విషయంలో సర్వే నంబ ర్‌, విస్తీర్ణం ఆధారంగా అన్ని కోణాల్లో జిల్లా యంత్రాంగం పరిశీలిస్తున్నది. అదే సమయంలో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ)కు సంధించిన పారిశ్రామిక వాడల్లో అందుబాటులో ఉన్న స్థలమెంత? తక్షణం వినియోగంలోకి తెచ్చుకునే భూమి  ఎంత ఉంది? వంటి వివరాలను సంబంధిత జోన ల్‌ మేనేజర్లతో సంప్రదింపులు జరిపి పరిశీలించాలని ప్రభుత్వం  మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తానికి ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త వ్యవసాయ సాగు విధానం, క్రాప్‌ కాలనీల ఏర్పాటు? ఏయే ప్రాంతాల్లో ఏ విధమై న పంటలు పండుతాయి? ఆ పండే పంటల సాగువిస్తీర్ణాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో నెలకొల్పే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ఆ ప్రాంత వ్యవసాయ ఉత్పత్తులే ప్రధాన అంశంగా నిలిచే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.     


logo