బుధవారం 03 జూన్ 2020
Jangaon - May 12, 2020 , 01:41:43

ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శం

ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శం

  • ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

స్టేషన్‌ఘన్‌పూర్‌ /స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్‌/ధర్మసాగర్‌, మే 11 : కరోనా కట్టడిలో తెలంగాణ సర్కారును ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకున్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని కేఆర్‌ గార్డెన్‌లో, ధర్మసాగర్‌ పీహెచ్‌సీలో సోమవారం ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎం, వైద్యసిబ్బందికి కడియం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ధర్మసాగర్‌ మండల కేంద్రంలో లోడీ సాంఘిక సేవా సమితి ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసరాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ దేశంలో లాక్‌డౌన్‌కు వారం రోజుల ముందే వలసకూలీలను వారి స్వస్థలాలకు పంపించడంలో కేంద్రం విఫలమైందని, వారిని ఆదుకునేందుకు కమిటీ వేయాలన్నారు. కార్యక్రమాల్లో గట్టయ్య, ఏడవెల్లి కృష్ణారెడ్డి, జగన్‌, రామునాయక్‌, డాక్టర్‌ రవిరాథోడ్‌, ప్రసన్నకృష్ణ, డాక్టర్‌ సాజిత హత్తారే, ఫాదర్‌ ప్రవీణ్‌తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


logo