శుక్రవారం 05 జూన్ 2020
Jangaon - May 11, 2020 , 02:27:43

అపరభగీరథుడు సీఎం కేసీఆర్‌

అపరభగీరథుడు సీఎం కేసీఆర్‌

  • స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్‌ఘన్‌పూర్‌, మే 10 : అపరభగీరథుడు సీఎం కేసీఆర్‌ అని, రైతును రాజు చేయడమే లక్ష్యంగా సాగునీటి వనరులు కల్పిస్తున్నారని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని తాటికొండ గ్రామ శివారులో పునరుద్ధరించిన వల్లభరాయ చెరువుతోపాటు కాల్వ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. తొలుత మల్లన్నగండి రిజర్వాయర్‌ నుంచి వల్లభరాయ చెరువు వరకు పూర్తి చేసిన కాలువ కట్టపై 7 కిలోమీటర్ల వరకు ఆయన పాదయాత్ర చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ 2018లో స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజక వర్గంలోని సాగునీటి సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా మల్లన్నగండి రిజర్వాయర్‌ నుంచి ఎడమ కాల్వ పీచర వరకు, కుడి కాల్వ తాటికొండ వల్లభరాయ చెరువు ఫీడర్‌ కాల్వ పనుల కోసం రూ. 2.7 కోట్లు మంజూరు చేశారన్నారు. కాల్వ నిర్మాణం పూర్తికావడంతో దాదాపు ఏడు వేల ఎకరాల వరకు సాగు నీరు అందుతుందన్నారు. సమావేశంలో ఆర్డీవో రమేశ్‌, తహసీల్దార్‌ విశ్వప్రసాద్‌, ఐబీ డీఈ బాలరాజు, జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ మారపాక రవి, కుడా డైరెక్టర్‌ ఎ. కుమార్‌, చిలుపూరు దేవస్థాన చైర్మన్‌ నర్సింహారెడ్డి, సర్పంచ్‌ చల్లా ఉమాదేవి  పాల్గొన్నారు. 


logo