శుక్రవారం 05 జూన్ 2020
Jangaon - May 10, 2020 , 02:39:36

అపరభగీరథుడు సీఎం కేసీఆర్‌..

అపరభగీరథుడు సీఎం కేసీఆర్‌..

  • ఎమ్మెల్సీ కడియం 

లింగాలఘనపురం, మే 09 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరుపేదలు, వలస కూలీలను ఆదుకున్న అపరభగీరథుడు సీఎం కేసీఆర్‌ ఆని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ ఆవరణలో వైద్యసిబ్బందికి, ఆశ కార్యకర్తలకు శనివారం కడియం ఫౌండేషన్‌ అధ్వర్యంలో నిత్యావసర సరకులు అందించారు. వంగ నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీహరి మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో లాక్‌డౌన్‌కు ఆదేశాలివ్వడమేగాక పేదలకు 12 కిలోల చొప్పున బియ్యం, రూ.1500 నగదు అందించి ఆదుకున్నారని చెప్పారు. కడియం ఫౌండేషన్‌ అధ్వర్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వెయ్యి మందికి నిత్యావసర సరకులు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి కరుణాకర్‌రాజు, మాజీ జెడ్పీటీసీ పోకల శంకరయ్య, సర్పంచులు సాదం విజయామనోహర్‌, చిట్ల స్వరూపరాణి, కాటం విజయ, మోహన్‌రెడ్డి, ఉంగరాల శ్రీధర్‌, నాయకులు చిట్ల భూపాల్‌రెడ్డి, గుర్రం బాలరాజుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo