గురువారం 28 మే 2020
Jangaon - May 10, 2020 , 02:39:38

ఓర్వలేకే విపక్షాల ఆరోపణలు

ఓర్వలేకే విపక్షాల ఆరోపణలు

  • జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

జనగామ, మే 09 : దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ పాలన చూసి ఓర్వలేకే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నా రు. శనివారం స్థానిక బస్టాండ్‌ ఆవరణలో టీఆర్‌ఎస్‌ జిల్లా మహిళా విభాగం నాయకులు పొత్కనూరి మంజుల, కొలగాని కావ్య నిరుపేదలకు బియ్యం, నిత్యావసరాలు సమకూర్చగా ముత్తిరెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నదాతల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని అన్నారు. స్వరాష్ట్రంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ప్రేమ ఉంటే తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నులరూపంలో చెల్లించిన రూ.లక్షా 55 కోట్లను ఇక్కడి రైతులు, ప్రజల కోసం తిరిగి ఇప్పించాలని ముత్తిరెడ్డి డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలోఉదయలక్ష్మి, లెనిన్‌ పాల్గొన్నారు. 


logo