గురువారం 28 మే 2020
Jangaon - May 10, 2020 , 02:39:38

ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్‌

ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్‌

  • వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌

స్టేషన్‌ఘన్‌ఫూర్‌/స్టేషన్‌ఘన్‌పూర్‌ టౌన్‌, మే 9 : అన్నదాతలకు ఆపద్బాంధవుడిగా సీఎం కేసీఆర్‌ నిలిచారని వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ అన్నారు. శనివారం స్థానిక కొత్త బస్టాండ్‌ ఆవరణలో  సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఎంపీ దయాకర్‌, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య క్షీరాభిషేకం చేశారు. చిలుపూరు మండలంలోని రాజవరంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి ఎంపీ ధాన్యాభిషేకం నిర్వహించి ఆటోడ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కృష్ణారెడ్డి, కుడా డైరెక్టర్‌ కుమార్‌, ఎంపీపీ సరిత, చిలుపూరు దేవస్థానం చైర్మన్‌ నర్సింహారెడ్డి, పొట్లపెల్లి శ్రీధర్‌రావు, మనోజ్‌రెడ్డి, మారబోయిన ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


logo