శనివారం 30 మే 2020
Jangaon - May 09, 2020 , 02:48:52

మున్సిపాలిటీలకు ప్రగతి నిధులు

మున్సిపాలిటీలకు ప్రగతి నిధులు

  • జీడబ్ల్యూఎంసీకి రూ.7.35 కోట్లు

వరంగల్‌, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. పట్టణాల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా 10 రోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించింది. కాలనీల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరించింది. మిగిలిన సమస్యల పరిష్కారానికి క్రమం తప్పకుండా ప్రతి నెలా నిధులను అందిస్తున్నది. ఇందులో భాగంగానే మే నెల పట్టణ ప్రగతి నిధులను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ. 7.35 కోట్లు విడుదల చేశారు. జనగామ మున్సిపాలిటీకి రూ. 4.57 కోట్లు, పరకాలకు రూ. 2.25 కోట్లు, నర్సంపేటకు రూ. 3.22 కోట్లు, వర్ధన్నపేటకు రూ. 1.74 కోట్లు, మహబూబాబాద్‌కు రూ. 6.38 కోట్లు, డోర్నకల్‌కు రూ.1.41 కోట్లు, మరిపెడకు రూ. 1.67 కోట్లు, తొర్రూరుకు రూ. 1.79 కోట్లు, భూపాలపల్లికి రూ. 5.69 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.logo