శనివారం 30 మే 2020
Jangaon - May 09, 2020 , 02:48:53

మొక్కలను సంరక్షించాలి

మొక్కలను సంరక్షించాలి

  • స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్‌ఘన్‌ఫూర్‌టౌన్‌/ధర్మసాగర్‌, మే 08: తెలంగాణకు మణిహారం హరితహారం అని, సీఎం కేసీఆర్‌ పిలుపునకనుగుణంగా మొక్కల సంరక్షణకు అందరూ కృషి చేయాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కోరారు. శుక్రవారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉపాధి హామీ కూలీలతో చేపట్టిన డంపింగ్‌ యార్డు పనులను పరిశీలించి, నర్సరీలో మొక్కలకు నీరు పోశారు. ధర్మసాగర్‌ మండలం శాయిపేట గ్రామంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సోంపెల్లి కరుణాకర్‌, సర్పంచ్‌ మామిడి రవీందర్‌ యాదవ్‌తో కలిసి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో డీఆర్డీవో రాంరెడ్డి, ఎంపీడీవో కుమారస్వామి, ఎంపీపీ కందుల రేఖగట్టయ్య, కృష్ణారెడ్డి, రమేశ్‌గౌడ్‌, సురేశ్‌కుమార్‌, శాయిపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ నిమ్మ కవిత పాల్గొన్నారు.     


logo