ఆదివారం 31 మే 2020
Jangaon - May 06, 2020 , 01:15:26

హేమాచలుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

హేమాచలుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయ అర్చకులు శ్రీఅమరవాది మురళీకృష్ణమాచార్యులు బృందం ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఉదయం సతీసమేతంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలకు కోనేరులో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంపై ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు  చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 12 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని, 7న స్వామి వారి కల్యాణం ఉంటుందన్నారు. గుట్టపైకి భక్తులకు అనుమతి లేదన్నారు. పూజల్లో ఆలయ ప్రధాన అర్చకుడు కైంకర్యం రాఘవాచార్యులు,  రాజశేఖరశర్మ, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.


logo