బుధవారం 03 జూన్ 2020
Jangaon - May 06, 2020 , 01:15:26

రక్తదానానికి యువత ముందుకు రావాలి

రక్తదానానికి యువత ముందుకు రావాలి

  • ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

స్టేషన్‌ఘన్‌ఫూర్‌, నమస్తే తెలంగాణ/మడికొండ : అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తుల చికిత్స నిమిత్తం మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 7న స్టేషన్‌ఘన్‌పూర్‌ పీహెచ్‌సీలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని, మంత్రి ఎర్రబెల్లి హాజరుకానున్నట్లు తెలిపారు.  రక్తదాతలు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే రాంపూర్‌లో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ జోరిక రమేశ్‌, సంపత్‌, మహేశ్‌, సురేశ్‌, దేవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


logo