శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jangaon - Mar 10, 2020 , 03:29:48

వైభవంగా వానకొండయ్య జాతర

వైభవంగా వానకొండయ్య జాతర

   పాలకుర్తి, మార్చి09: పుణ్య క్షేత్రమైన స్వయంభూ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. హోలీ పర్వదినం సందర్భంగా  సోమవారం సోమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా  తరలివచ్చారు. తెల్లవారు జాము నుంచే స్వామివారి దర్శనానికి బారులు తీరారు. గర్భగుడిలో శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు పూజలు చేశారు. తలనీలాలను సమర్పించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. లక్ష్మీనరసింహాస్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షీరగిరి క్షేత్రం శిఖరం వద్ద  గండదీపం వెలిగించి పూజలు నిర్వహించారు. కొండ దిగువన ఉన్న ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు దేవగిరి లక్ష్మన్న, మత్తగజం నాగరాజు, ఆలయ సూపరింటెండెంట్‌ కొత్తపల్లి వెంకటయ్య, ముంజ రాములు, బండారి శ్రీనివాస్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.   

సిద్ధేశ్వరాలయంలో..

 బచ్చన్నపేట, మార్చి 09 : మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరాలయంలో సోమవారం భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి ఓంనమశివాయ ఆధ్వర్యంలో హోళీ పండుగను పురస్కరించుకుని వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి మొక్కు లు చెల్లించుకున్నారు. అదే విధంగా కాళభైరవస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిధిలో ఉన్న ఆంజనేయస్వామి, దత్తాత్రేయ, సరస్వతి, సాయిబాబా ఆలయాలను భక్తులు సందర్శించి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయానికి యాదగిరిగుట్ట, హైదరాబాద్‌, సిద్దిపేట, జనగామ, ఆలేరు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఆలయ నిర్వా హకులు భక్తులకు సకల సౌకర్యాలు కల్పిం చారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సదాశివు డు, మహాశివుడు, సంగమేశ్వర్‌, ముక్తేశ్వర్‌, సిబ్బంది చల్లా రాజేందర్‌రెడ్డి, మధు, లక్ష్మీకాంత్‌రెడ్డి. గ్రామస్తులు తదితరులు  పాల్గొన్నారు.

స్వామివారిని దర్శించుకున్న  బోడుప్పల్‌ మేయర్‌

    మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని సోమవారం బోడుప్పల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సాముల బుచ్చిరెడ్డి సహా పలువురు కార్పొరేటర్లు దర్శించుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ప్రాంతంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన స్వయంభూ సిద్ధేశ్వరుడిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయన్నది భక్తుల నమ్మకం. ఆలయ ప్రధాన పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ సిద్దేశ్వరుడిని దర్శించుకుంటే అంతామంచి జరుగుతుందని తమ నమ్మకమని, ప్రతీ ఉత్సవాలకు వస్తుంటామని తెలిపారు. గత పాలకుల హయాంలో తెలంగాణలో దేవాలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాని సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలు పూర్వవైభవం సంతరించుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింగిరెడ్డి పద్మారెడ్డి, సిరియాల నర్సింహ, నాయకులు ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo