గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Mar 10, 2020 , 03:28:47

జిల్లాలో ఘనంగా హోలీ పండుగ..

జిల్లాలో ఘనంగా హోలీ పండుగ..

జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 9 : హోలీ వేడుకలను జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. జనగామ ఏసీపీ వినోద్‌కుమార్‌, జనగామ, నర్మెట సీఐలు మల్లేశ్‌ యాదవ్‌, సంతోశ్‌కుమార్‌, ఎస్సైలు శ్రీనివాస్‌, రాజేశ్‌ సహా పోలీసులు సిబ్బంది కుంకుమ చల్లుకొని సంబురాలు చేసుకున్నారు. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఆర్యవైశ్య మహాసభ, అవోపా, ఐవీఎఫ్‌, వర్ధన్‌ ఆశ్రమం సహా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, యువకులు, విద్యార్థులు, చిన్నారులు, మహిళలు ఆనందోత్సాహాల మధ్య వేడుకలు రంగులు చల్లుకున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో సహజ సిద్ధమైన రంగులు చల్లుకొని సాదాసీదాగా హోలీ నిర్వహించడం కనిపించింది. పసుపు, కుంకుమ, కోడిగుండ్లు, టమాటలు, స్థానికంగా లభించే రంగులను ఉపయోగించారు. వేడుకల్లో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గౌరవ అధ్యక్షుడు పజ్జూరి గోపయ్య, అధ్యక్షుడు పోకల లింగయ్య, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు, కౌన్సిలర్‌ మహంకాళి హరిశ్చంద్రగుప్త, ఛాంబర్‌ మాజీ అధ్యక్షుడు పజ్జూరి జయహరి, గంగిశెట్టి ప్రమోద్‌కుమార్‌, ఐవీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బిజ్జాల నవీన్‌గుప్తా, మాశెట్టి వెంకన్న, గట్టు వెంకటేశ్వర్లు, బుస్సా లింగం, రామిని రాజేశ్వర్‌, ధారం నాగయ్య, ఎర్రం ప్రసాద్‌, జైన రమేశ్‌, సురుగు సుధాకర్‌, సతీశ్‌ పాల్గొన్నారు. 


logo
>>>>>>