గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Mar 10, 2020 , 03:27:54

‘మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి’

‘మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి’

కాజీపేట, మార్చి 09 : ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో మందుండాలని రైల్వే ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్‌ కమర్షియల్‌ బ్రాంచి సెక్రటరీ కేఎన్‌ రావు అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్‌ పరిధిలోని ఆల్‌ ఇండియా రైల్వే ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్‌ కార్యాలయంలో సోమవారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని సావిత్రీ బాయిఫూలే, అంబేద్కర్‌ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అసోసియేషన్‌ సభ్యులు మహిళలను శాలువాలతో సన్మానించి, పుష్పగుచ్ఛాలు, మెమెంటోలను అందజేసి, మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేఎన్‌ రావు మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలపై పోరాడి  పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కమల,  శ్రీలేఖ గ్రూప్‌ మహిళా సంఘం అధ్యక్షురాలు మంగ, మహిళా నాయకురాళ్లు, మహిళా కార్మికులతో పాటుగా చింత తిరుపతి, హరిబాబు, మురళి, చంద్రమౌళి, పూల్‌ సింగ్‌, భైరవ, పురేంద్రచారి, ఎస్‌ఆర్వీ రావు, తదితరులు పాల్గ్గొన్నారు. అలాగే కాజీపేట పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినత్సోవాన్ని  పురస్కరించుకుని సోమవారం షెడ్యూల్డ్‌ కులాల హక్కుల అభివృద్ధి సమితి  ఆధ్వర్యంలో కేక్‌  కట్‌చేసి  మహిళలను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  సమితి రాష్ట్ర అధ్యక్షుడు యమడాల హనుకాంత్‌ మాట్లాడుతూ  ప్రతి పురుషుడు మహిళను గౌరవించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాదసి  సులోచన, రమ, ఈశ్వరమ్మ, శకుంతల,  స్వరూప, విమల తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>