మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Mar 10, 2020 , 03:24:54

నిట్‌లో అధ్యాపకుల శిక్షణ ప్రారంభం

నిట్‌లో అధ్యాపకుల శిక్షణ ప్రారంభం

 నిట్‌క్యాంపస్‌, మార్చి 09 : నిట్‌లో మూడు అధ్యాపక శిక్షణ కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వ రంగల్‌ అర్బన్‌ జిల్లాలోని నిట్‌ సెమినా ర్‌ హాల్‌లో నిట్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డీవీఎస్‌ఎస్‌ శర్మ  జ్యోతిప్రజ్వలన చేసి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. టీచింగ్‌ అండ్‌ లర్నిం గ్‌  సెంటర్‌(టీఎల్‌సీ) ద్వారా పలు వి ద్యా, పరిశోధనాంశాలకు సంబంధించి అధ్యాపకుల శిక్షణలు ఈ సదస్సుల ద్వారా నిర్వహించారు. ఫిజిక్స్‌ విభాగంలో స్కిల్స్‌ ఇన్‌టీచింగ్‌ మెథడ్స్‌ అండ్‌ స్ట్రాటజీస్‌ ఇన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, టీచింగ్‌ అండ్‌ లర్నింగ్‌ ఆఫ్‌ ఫంక్షనల్‌ మెటీరియల్‌ అండ్‌ డివైజెస్‌ త్రూ హ్యాండ్స్‌ ఆన్‌ ఎక్స్‌పీరియన్స్‌ అనే అంశాలపై శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది.  అలాగే కంప్యూటర్‌ సైన్స్‌, బయోటెక్నాలజీ విభాగంలో ‘టీచింగ్‌ అండ్‌ లర్నిం గ్‌ ప్రాక్టీసెస్‌ ఆఫ్‌ డేటా అనాలసిస్‌ త్రూ హ్యాండ్‌ ఇన్‌ ఎక్స్‌పీరియన్స్‌' అనే అం శంపై రామన్‌ సెమినార్‌ హాల్‌లో  శిక్ష ణ నిర్వహించారు. ఈ శిక్షణలో టీఎల్‌సీ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ రామచంద్రయ్య, డాక్టర్‌ కే మాధవి, ప్రొఫెసర్‌ అజిత్‌ కుమార్‌రెడ్డి, డాక్టర్‌ పాల్‌ జోసెఫ్‌, వివిధ యూనివర్సిటీలు, కళాశాలల నుంచి వచ్చిన అధ్యాపకులు, ప్రొఫెసర్లు  పాల్గొన్నారు.


logo
>>>>>>