మంగళవారం 31 మార్చి 2020
Jangaon - Mar 09, 2020 , 03:12:43

పాడి పరిశ్రమకు చేయూత

పాడి పరిశ్రమకు చేయూత

రెడ్డికాలనీ, మార్చి 08: పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హన్మకొండలోని విజయ పాల డెయిరీ మరింత అభివృద్ధి దిశగా పరుగులు పెట్టనుంది. ప్రభు త్వం ఆదివారం బడ్జెట్‌ కేటాయింపుల్లో విజయ డెయిరీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సంస్థ బాధ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  మునుపెన్న డూ లేని విధంగా ఈసారి బడ్జెట్‌లో ప్రభ్వుతం డెయిరీకి రూ.100 కోట్లు కేటాయించింది. పాలు, పాల ఉత్పత్తు లు, తాగునీటితో ముందుకెళ్తున్న విజయ డెయి రీ ప్రభుత్వం ప్రకటించిన నిధు లతో మరిం త అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందు కు అడుగులు వేయనుంది. పాడి రైతుల శ్రేయస్సు దృష్ట్యా మరింత పాల సేకరణ ధర పెంచడానికి ఆవు పాలు, గేదె పాలు లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు పెం చింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవే ట్‌ డెయిరీలకు ఎక్కడా స్థానం కల్పించకుం డా నమ్మకం, నాణ్యతతో కూడిన విజయ పాలు, పాల ఉత్పత్తులు అందిస్తోంది. పాడి రైతులకు అందుబాటులో ఉంటూ వారి నుంచి పాలను సేకరించడమే కాకుండా ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ ఫలాలను అందిస్తోంది. ప్రైవేట్‌ డెయిరీ లు సేకరిస్తున్న లీటర్‌ పాలకు అదనంగా విజయ డెయిరీ రూ.4 ప్రోత్సాహాన్ని అందిస్తూ పాడి రైతులను ప్రైవేట్‌ డెయిరీల బారిన పడకుండా కాపాడుకుంటోంది. జనగామ మినహా వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ నుంచి ఉద యం, సాయంత్రం పాలు సేకరిస్తోంది. మొత్తం 8పాల శీతలీకరణ కేంద్రాలు ఉన్నా యి. ప్రస్తుతం 200 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా 300 పాల సేకరణ కేంద్రాల నుంచి 3500 మంది రైతు లు రోజూ 11వేల లీటర్ల పాలను పోస్తున్నా రు. వీరికి ప్రతి పదిహేను రోజులకోసా రి బిల్లులు చెల్లిస్తున్నారు. ఇందుకు ప్రభు త్వ ఉద్యోగులు,15 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బ ంది విజయ డెయిరీ కింద పనిచేస్తున్నారు. 

పాడి రైతులకు అదనపు ప్రోత్సాహం

స్వరాష్ట్రంలో ప్రైవేట్‌కు లబ్ధి చేకూర్చేలా వలసపాలకులు ప్రదర్శించిన నిర్లక్ష్యంతో నష్టాల ఊబిలో నడుస్తున్న విజయ డెయిరీ తెలంగాణ రాష్ట్రంలో విజయపథంలో దూ సుకుపోతున్నది. పాడి రైతులకు ప్రభుత్వం లీటర్‌ పాలకు రూ.4 ప్రోత్సాహం ప్రకటించింది. నాణ్యత, నమ్మకానికి చిరునామాగా నిలుస్తూ విజయ డెయిరీ ఇతర రాష్ర్టాలతో పాటు విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత పరిశ్రమపై ఆధారపడిన పాడిరైతులకు లీటర్‌కు రూ.4 అదనంగా ప్రోత్సాహాన్ని అందిస్తోంది. పాడి రైతులు సైతం ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం బ ర్రెల కొనుగోలు కోసం రాయితీలు ఇస్తుం ది.  గతంలో ఎప్పుడూ విజయ డెయిరీకి రూ.30, 35 కోట్లకు మించి కేటాయించలేదు. ఈసారి ఏకంగా రూ.100 కేటాయించడంపై ఆనందం వ్యక్తమవుతోంది.


logo
>>>>>>