బుధవారం 08 ఏప్రిల్ 2020
Jangaon - Mar 08, 2020 , 02:43:41

మహిళలు మహారాణులు

మహిళలు మహారాణులు

జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 7 : ‘ఆకాశంలో సగం.. అవనిలో సగం’ అంటూ మహిళాలోకం పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారు.   ప్రభుత్వాలు కల్పిస్తున్న ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లతో పలువురు మహిళలు అటు ప్రభుత్వ అధికారులుగా..ఇటు ప్రజాప్రతినిధులుగా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగుతున్నారు. అంతేకాకుండా మహిళలకు ఆర్ధిక స్వావలంభన, సాధికారిత కోసం ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో ఉపాధి రంగాల్లోనూ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. స్థానిక సంస్థల్లో ఇప్పటికే అమల్లో ఉన్న 50శాతం రిజర్వేషన్ల ఫలితంగా ఎంతోమంది మహిళలు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి వివిధ పదవుల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. కొత్తగా ఆవిర్భవించిన జనగామ జిల్లా కలెక్టర్‌గా కె.నిఖిల స్ఫూర్తిదాయకంగా బాధ్యతలు నిర్వరిస్తుంటే..ఇటీవల జరిగిన పుర ఎన్నికల్లో సాధారణ మహిళ భర్త ప్రేరణతో రాజకీయ అరంగేట్రం చేసి మహిళా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నియ్యారు. జిల్లాలో మహిళా సంక్షేమ అధికారిగా, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారిణి, ఉపాధి కల్పనశాఖ అధికారిణిగా మహిళలు పనిచేస్తున్నారు.

 


‘భర్త సహకారం.. కలిసి వచ్చిన అవకాశంతో జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా జిల్లా కేంద్రంగా ఏర్పడిన జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ను అయ్యా. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులుగా.. మాజీ కౌన్సిలర్‌గా భర్త లింగయ్య ప్రజలు, వ్యాపార వర్గాలతో మమేకం అవుతున్న తీరును ఆకళింపు చేసుకొని ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 26వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొంది తెలంగాణ రాష్ట్రంలో రెండో మహిళా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికవ్వడం అదృష్టంగా భావిస్తున్నా’. మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నా.. ఇంకా అవకాశాలు అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో దూ సుకెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సముచిత స్థానం కల్పిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. స్థానిక సంస్థల్లో అమల్లో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల ఫలితంగా ఎందరో మహిళలు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి వివిధ పదవుల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. మహిళలు సంఘటిత శక్తిగా ఎదిగినప్పుడే సాధికారిత సాధ్యమవుతుంది. అందుకు ప్రభుత్వాల నుంచి మరింత ప్రోత్సా హం అందాలి. గతంలో మహిళలకు రక్షణ లేకుం డా పోయింది. కేసీఆర్‌ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పోలీసుశాఖలో షీ టీం పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు. ప్రభుత్వాలు కల్పించిన పదవులు, అవకాశాలను మెట్లుగా చేసుకొని రాజకీయాల్లో మరింత ఎత్తుకు ఎదగాలి.                                        -పోకల జమున, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌
logo