శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Mar 08, 2020 , 02:37:16

విద్యార్థులు లక్ష్యసాధనతో చదవాలి

విద్యార్థులు లక్ష్యసాధనతో చదవాలి

పాలకుర్తి రూరల్‌, మార్చి 07 : విద్యార్థులు లక్ష్యసాధనతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి ఉషాదయాకర్‌రావు అ న్నారు. శనివా రం మండలంలోని చెన్నూ రు ఉన్నత పాఠశాలలో ప్రయాణ భత్యం కింద మంజూరైన రూ.2లక్షల 69వేల700విలువైన 63సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉషాదయాకర్‌రావు మాట్లాడుతూ బాలబాలికలకు వి ద్యార్థి దశ కీలకమన్నారు. ఉపాధ్యాయులు వి ద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అం దించాలని సూచించారు. విద్యార్థులు హిందీ, ఆంగ్ల భాషలపై పట్టు పెంచుకోవాలన్నారు. వి ద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, విద్యార్థులకు సన్నబియ్యం అందించి న ఘ నత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృషి చేస్తున్నారన్నారు. ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం బెంచీలను అందజేశారని, ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీల నిర్మాణాలకు నిధులు మంజూరు చే శారన్నారు. చెన్నూరు ఉన్నత పాఠశాల అభివృద్ధికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతో కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, ఎంవీఐ గంట రవీందర్‌, జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ మదార్‌, సర్పంచ్‌ పుస్కూరి పార్వతి రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీ పుస్కూరి కళింగరావు, మాజీ స ర్పంచ్‌ కారుపోతుల వెంకటయ్య, ఎండీ అ బ్బాస్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ కా రుపోతుల వేణు, జంపాల అంజయ్య, పోగు శ్రీనివాస్‌, హెచ్‌ఎం పోతుగంటి నర్సయ్య, కూటికంటి సోమయ్య, కూటికంటి శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


మహిళల సంక్షేమానికి పెద్దపీట..

మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పె ద్దపీట వేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి, ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్టు చైర్‌ పర్సన్‌ ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు అన్నారు. శనివారం పాలకుర్తి మండలంలోని చెన్నూరు ఉన్నత పాఠశాల, ప్ర భుత్వ దవాఖానలో మహిళా దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉషాదయాకర్‌రావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నలా ్లనాగిరెడ్డి, హెచ్‌ఎం పోతుగంటి నర్సయ్య, జె డ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ మదార్‌, గం ట రవీందర్‌, కారుపోతుల వేణు, అంజ య్య, ఉపాధ్యాయులు పద్మజ, ఉమాదేవి, కవిత, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo