ఆదివారం 24 మే 2020
Jangaon - Mar 06, 2020 , 02:54:00

నేడు కల్యాణం

నేడు కల్యాణం


చిలుపూర్‌, మార్చి 05 : చిలుపూర్‌ బుగులు వెంకటేశ్వరస్వామి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి అ య్యాయి.  బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం దేవతామూర్తుల కల్యాణానికి ఉత్సవ కమిటీ ప్ర త్యేక ఏర్పాట్లను చేపట్టింది. ఆలయ పరిధిలో ఉ న్న కాలక్షేప మంటపంలో కల్యాణాన్ని జరిపించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రెండురోజులుగా కల్యాణానికి సిద్ధం చేస్తున్నారు. ము ఖ్యఅతిథులను స్వాగతించేందుకు ఉత్సవ కమిటీ చైర్మ న్‌ నర్సింహారెడ్డితోపాటు సభ్యులు సిద్ధమయ్యా రు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోనే హోమాలను కాల్చడంతోపాటు వేదమంత్రాలతో ప్రత్యేక పూజాకార్యక్రమాలు చేపడుతున్నారు. బుధవారం గరుడ పూజను నిర్వహించి దేవతలందరికీ వేంకటేశ్వరుడు-పద్మావతి కల్యాణ సమాచారా న్ని అందించేందుకు ఆకాశమార్గానికి గరుడిని య జ్ఞాచార్యులు అరుణ్‌కుమారచార్యులు బృం దం సాగనంపారు. గురువారం ఉదయం నిత్య హో మం జరిపించారు. సాయంత్రం ఎదురుకోల్ల తం తు జరిగింది. శుక్రవారం స్వామి వారి కల్యా ణం సందర్భంగా అన్ని ఏర్పాట్లను చేపట్టారు. 


ఘనంగా సుదర్శన హోమం..ఎదుర్కోలు

చిలుపూర్‌ బుగులు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయంలో  సుదర్శన హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాజ్ఞాచార్యులు అరుణ్‌కుమారాచార్యులు మాట్లాడుతూ దేవతామూర్తుల కల్యాణానికి గడియలు దగ్గరపడుతున్నాయని, కల్యాణతంతు కార్యక్రమానికి ముందు ఆలయంలో సుదర్శనహోమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.  అందరు ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో ఉండాలని, ధన, ధాన్య సిద్ధిరస్తుతో పాటు శత్రు నివారణకు సుదర్శన హోమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మూల మంత్ర హోమంతో పంచసూక్ష్మహోమం, బలిహరణం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా కల్యాణానికి ముందుగా జరగాల్సిన ఎదుర్కోలు కార్యక్రమాన్ని జాతర కమిటీ చైర్మన్‌ ఇనుగాల నర్సింహరెడ్డి దంపతులు, ఇన్‌చార్జి ఈవో ధనుంజయశర్మలతోపాటు జాతర కమిటీ సభ్యులు జంగిటి కుమార్‌, కాండూరి రంగరాజు, సత్తయ్య, గంగాధర్‌రెడ్డి, గట్టు చేరాలు, ఎల్లమ్మ, రాజులు ఘనంగా జరిపించారు కార్యక్రమంలో సౌమిత్రి శేషాచార్యులు, రంగాచార్యులు, లక్ష్మీనర్సింహాచార్యులు, బ్రాహ్మణపల్లి రవీంద్రాచార్యులు, వెంకటరమణాచార్యులు, కిరణ్‌కుమారాచార్యులు, సంతోష్‌కుమారాచార్యులు, సిద్ధార్థచార్యులతోపాటు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. logo