శనివారం 04 ఏప్రిల్ 2020
Jangaon - Mar 06, 2020 , 02:50:04

క్రెడిట్‌ ప్లాన్‌ లక్ష్యాలు అధిగమించాలి

 క్రెడిట్‌ ప్లాన్‌ లక్ష్యాలు అధిగమించాలి

జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 05 : 2019-20 రుణ ప్రణాళిక లక్ష్యాలు సహా 2020-21 సంవత్సరంలో జిల్లాలో వివిధ సం క్షేమ పథకాలు, కార్యక్రమాల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా మంజూరు చేయాల్సిన బ్యాంక్‌ బడ్జెట్‌ కేటాయింపులపై శనివారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ కే నిఖిల బ్యాంకర్లతో (డీసీసీ-డీఎల్‌ఆర్‌సీ) సమీక్షించారు. నాబార్డు ఏజీఎం కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా లీడ్‌ బ్యాంక్‌ కోఆర్డినేటర్లతో బ్యాంకుల వారీగా రుణ ప్రణాళిక, కేటాయింపులు, సబ్సిడీ, నిధుల విడుదల వంటి అంశాలపై చర్చించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2333.94కోట్ల బడ్జెట్‌ కేటాయింపునకు బ్యాంకర్లు అంగీకరించిన నేపథ్యంలో సాధించిన ప్రగతిపై బ్యాంకుల వారీగా సమీక్షించిన ఆమె కోటాక్‌ మహేంద్ర బ్యాంకు సున్న లక్ష్యంలో ఉండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతి బ్యాంక్‌ కంట్రోల్‌ విధిగా సమావేశాలకు హాజరు కావాలని, టార్గెట్‌ లక్ష్యాలపై 15రోజుల్లో నివేదికలతో సహా ప్రభుత్వ పథకాల రుణాలపై పునర్‌ పరిశీలన చేసుకొని నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. మరోసారి సమావేశానికి హాజరయ్యే ముందుగానే పూర్తిస్థాయి నివేదికతో బ్యాంకర్లు హాజరుకావాలని స్పష్టం చేశారు. ఆర్‌బీఐ ప్రతినిధి కేఎల్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ బ్యాంకర్లు టార్గెట్‌ విషయంలో సీరియస్‌గా తీసుకోవడంలేదన్నారు. వచ్చే డీసీసీ-డీఎల్‌ఆర్‌సీ సమావేశానికి పూర్తి నివేదిక సిద్ధం చేసుకొని రావాలని, జిల్లాలోని ఏ బ్యాంక్‌ అయినా సరే రూ.10 కాయిన్స్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని లేకుంటే బ్యాంక్‌కు రూ.25వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ టీవీ శ్రీనివాసరావు, డీఆర్‌డీవో రాంరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ కోర్నెలియ స్‌, పరిశ్రమ జీఎం రమేశ్‌, కేవీఐబీ ప్రాంతీయ అధికారి అశోక్‌, మత్య్సశాఖ ఏడీ శ్రీపతి, ఎస్‌బీఐ, ఏబీజీవీబీ, ఆంధ్రాబ్యాంకు, బ్యాంకర్లు, అధికారులు పాల్గొన్నారు. logo