ఆదివారం 24 మే 2020
Jangaon - Mar 05, 2020 , 02:53:39

ప్రగతి బాటలో జనగామ పట్టణం

ప్రగతి బాటలో జనగామ పట్టణం

జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 04 : పల్లెలు, పట్టణాల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం పరిష్కారం చూపుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, పురపాలక మంత్రి కేటీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా 10రోజులుగా జనగామ పురపాలక సంఘం పరిధిలోని 30వార్డుల్లో సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు పడ్డాయి. అప్పటికప్పుడు చేయదగినవి పరిష్కారం కాగా, నిధులతో కూడిన అంశాలను ఏడాది, ఐదేళ్ల కార్యాచరణలో ప్రతిపాదించారు. వార్డుల్లో సమస్యలు పరిష్కరించుకునే చక్కటి అవకాశం కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లకు లభిస్తే..తమ పనితీరును చూపించే అధికారం ప్రత్యేక అధికారులకు లభించింది. పట్టణ ప్రగతి ప్రారంభమైన మూడోరోజునే రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ జనగామలోని 13వ వార్డుల్లో ఆకస్మిక పర్యటనతో అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశ,నిర్ధేశం చేశారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్నం అద్దంలా కనిపించాలి..కాలనీల్లో పచ్చదనం..పారిశుద్ధ్యం..ప్రజలకు కనీస మౌళిక వసతులు ఉండాలన్న లక్ష్యంతో పట్టణ ప్రగతి అభివృద్ధి ప్రణాళిక ముందుకుసాగింది. వాడవాడలా జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రగతిబాట పర్యటన చేపట్టగా పలువార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ కె.నిఖిల విస్తృతంగా పర్యటించి ప్రగతి పనుల్లో భాగంగా పారిశుద్యం కార్యక్రమాన్ని పరిశీలించారు. 


కాలనీల్లో పారిశుధ్యం, ఖాళీ పాట్లు, స్థలాలు మురికితుమ్మలు, ముళ్లపొదల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించిన యంత్రాంగం అప్పటికప్పుడు చేయదగిన పనులకు అధికారులను పురమాయిస్తూ కొద్దిపాటి నిధులతో కూడిన పనులకు ఆదేశాలిస్తూ ఎక్కువ నిధులు అవసరం ఉన్న వాటిని నివేదిక రూపంలో కలెక్టర్‌కు అందజేశారు. అన్ని వార్డుల్లో ప్రత్యేక అధికారులు, కౌన్సిలర్లు, అభివృద్ధి కమిటీ సభ్యుల బృందాలు వాడవాడలా పర్యటించి సమస్యలను స్కానింగ్‌ చేశారు. కాలనీల్లో ఆఖరిరోజు అన్ని ప్రాంతాల్లో ప్రగతి పండుగ సందడితో ముగింపు కార్యక్రమాలు జరిగాయి. 10వ వార్డులో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున లింగయ్య  పాల్గొని మొక్కలు నాటి, దాతల సహకారంతో కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, విశ్రాంతి బెంచీలను ్రప్రారంభించారు.  2, 3, 4, 5, 6, 21, 22, 24, 25, 27, 28 వార్డుల్లో  పట్టణ ప్రగతి చివరిరోజు కార్యక్రమాలను పరిశీలించారు. పట్టణాన్ని ప్రగతి పథంలో నడిపి ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సర్కారు ఆశయానికి ప్రజలంతా స్వచ్ఛందంగా సంపూర్ణ మద్ధతు ఇచ్చారు. పట్టణంలోని 20వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా వార్డు కౌన్సిలర్‌ జూకంటి లక్ష్మి శ్రీశైలం ఆధ్వర్యంలో శ్రమదానంతో పారిశుద్ద్య పనులు చేశారు. 


సమస్యల్లేని వార్డులుగా మారాలి : కలెక్టర్‌

పట్టణ ప్రగతిలో జనగామ తెలంగాణకు ఆదర్శంగా నిలిచేలా 10రోజుల ప్రగతి ప్రణాళిక కార్యచరణలో సాగాలని జిల్లా కలెక్టర్‌ కె.నిఖల అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన ఆమె సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ స్పెషల్‌ ఆఫీసర్ల ఆధ్వర్యంలో నాలుగు కమిటీల బృందం తెలుసుకొన్న సమస్యలపై సంపూర్ణ నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. పల్లెప్రగతిలో గ్రామాల రూపురేఖలు మారినట్లుగానే పట్టణప్రగతి ద్వారా వార్డులోని కాలనీల ముఖచిత్రం మారాలని, అందుకు ప్రత్యేక అధికారులు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. పట్టణాలు నగరాలుగా నగరాలు మహానగరాలు మారాలంటే అభివృద్ది జరగాలని, అందుకు తగినట్లుగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందనాను. అత్యవసర పనులను ముందుగా గుర్తించి ప్రస్తుతం చేయదగిన అంశాలను అప్పటికప్పుడు చేయించి ఏడాది, ఐదేళ్ల ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. అధికారులు వార్డు పర్యటనలో  రికార్డు చేసుకున్న ప్రతి సమస్యను తీర్చేలా నివేదిక ఉండాలన్నా


logo