గురువారం 02 ఏప్రిల్ 2020
Jangaon - Mar 04, 2020 , 02:13:18

పట్టణాల్లో అభివృద్ధి జరగాలి

పట్టణాల్లో అభివృద్ధి జరగాలి
  • పట్టణ ప్రగతి పనుల తనిఖీలో ఎమ్మెల్యే
  • అంగన్‌వాడీ కేంద్రంలో అపరిశుభ్రత, ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాలలకు తలుపులు లేకపోవడంపై ముత్తిరెడ్డి ఆగ్రహం
  • హెడ్మాస్టర్‌, అంగన్‌వాడీ టీచర్‌కు మోమో జారీ
  • కేంద్రం నిర్వహణపై అధికారులపై సీరియస్‌
  • చెట్లు కాల్చిన స్వీపర్‌కు రూ.500 జరిమానా
  • 14వ వార్డులో యాదగిరిరెడ్డి విస్తృత పర్యటన

జనగామ, నమస్తేతెలంగాణ, మార్చి 03 : పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం జనగామలోని 14వ వార్డులో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆకస్మిక తనిఖీలతో కాలనీలో విస్తృతంగా పర్యటించారు. ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న ఇళ్లు నిబంధన మేరకు ఉంటున్నాయా?లేదా? సెట్‌బ్యాక్‌ లేకుండా రోడ్డును ఆక్రమిస్తున్నారా? తేల్చుకునేందుకు ఎమ్మెల్యే దగ్గరుండి టేపుతో రోడ్డు వెడల్పును కొలిపించారు. 60ఫీట్ల రహదారిపై 7 ఫీట్ల మేరకు ముందుకు వచ్చి మొక్క లు పెంచడం సరికాదని, డ్రైనేజీలకు రెండు ఫీట్ల దూరం నుంచి మొక్కలు నాటితే రోడ్డు వెడల్పు కనిపించి, భవిష్యత్‌లో ఆక్రమణకు గురికాకుండా ఉంటుందని అధికారులకు సూచించారు. అంబేద్కర్‌నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన విద్యార్ధుల మరుగుదొడ్లు, ఆవరణలో మొక్కల పెంపకం, సంరక్షణ, నీళ్లు పోస్తున్నారా?లేదా? వంటి అంశాలను పరిశీలించారు. పాఠశాలలో బాలికలు ఉపయోగించే మరుగుదొడ్ల లోపలికి వెళ్లి నీళ్లు వస్తున్నాయా? లేదా అని నల్లాలు విప్పి చూడటం సహా పరిశుభ్రంగా ఉందా? అంటూ స్వయంగా పరిశీలించారు. బాలికల కోసం ఉపయోగించే మూత్రశాలకు తలుపులు (రక్షణ) లేకుండా అడ్డం నిలబడాలా? మనం ఎక్కడ ఉన్నాం? ఆడపిల్లలపై కనీస మానవత్వం ఉండదా అంటూ హెడ్మాస్టర్‌ సంగి రాములుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ ఇల్లు..మీ పిల్లలు అయితే ఇలాగే చేస్తారా? 


ఆడపిల్లల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారంటూ మండిపడిన ఆయన హెడ్మాస్టర్‌కు మోమో జారీ చేయాలని ప్రత్యేక అధికారి, ఆర్డీవో మధుమోహన్‌ను ఆదేశించారు. అదేవిధంగా స్కూల్‌ ఆవరణలో గతంలో నాటిన మొక్కలకు సరిగా నీళ్లు పోయకుండా ఎండిన ఆకులను కాల్చివేసి పచ్చటి చెట్లు మాడిపోయేలా నిర్లక్ష్యం వహించినందుకు పాఠశాల స్వీపర్‌ వేతనంలో రూ.500 కోత విధించి జరిమానా వేయాలని ఆదేశించారు. పక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన ముత్తిరెడ్డి గదిలోకి వెళ్లిన వెంటనే కోడిగుండ్లు పగిలిపోయిన నేలపై పడటం అందులోనే చిన్నపిల్లలు ఆడుకుంటుండటం చూసి ఆయాను పిలిచి ‘ఏమమ్మా..మీ ఇల్లు అయితే ఇలానే ఉంటుందా? మీ పిల్లలకు అయితే నీసు వాసన వస్తుంటే కూర్చోబెడుతారా?’ అంటూ మందలించారు. అంగన్‌వాడీ టీచర్‌ ఎక్కడికి వెళ్లిందని ఆరా తీసిన ఎమ్మెల్యేకు ఐసీడీఎస్‌ ఆఫీసులో మీటింగ్‌కు వెళ్తున్నట్టు రాసిన లెటర్‌ను ఎమ్మెల్యేకు చూపించారు. వార్డులో ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే పట్ట ణ ప్రగతి కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలిసి కూడా నిర్లక్ష్యంగా సర్కారు ఆదేశాలను లెక్కచేయకుండా పోవడంపై ఆగ్రహించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి టీచర్‌ ఏ మీటింగ్‌కు వెళ్లింది? అక్కడ సమావేశం ఉందా? ఎ


మ్మెల్యే వస్తున్నాడని తెలిసి అంత అర్జంట్‌గా మీటింగ్‌ పెట్టడం ఏంటి? ఎందుకంత నిర్లక్ష్యం అంటూ జిల్లా సంక్షేమ అధికారి, సంబంధిత సెక్టార్‌ సూపర్‌వైజర్‌కు ఫోన్‌ చేసి నిలదీశారు. వారు పొంతనలేకుండా సమాధానం చెప్పడం.. కేంద్రంలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నా పట్టించుకోనందుకు అంగన్‌వాడీ టీచర్‌, ఆయాకు నోటీసులు జారీ చేయాలని కూడా ప్రత్యేక అధికారిని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో మధుమోహన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నోముల రవీందర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, కౌన్సిలర్‌ పేర్ని స్వరూప, కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్‌ సేవెల్లి సంపత్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సేవెల్లి మధు, కృష్ణ, జనగాం సత్తిరెడ్డి, పంతులు ప్రభాకర్‌రావు తదితరులు ఉన్నారు. 


logo
>>>>>>