బుధవారం 01 ఏప్రిల్ 2020
Jangaon - Mar 03, 2020 , 02:56:10

పల్లెల్లో ప్రగతి బాట..

పల్లెల్లో ప్రగతి బాట..

జనగామ రూరల్‌, మార్చి 02 : పల్లెలను ప్రగతి వైపు పయనించడానికి పల్లెప్రగతి బాట పట్టించి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామానికో ట్రాక్టర్‌ పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లా లో 281 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికి 211 జీపీల కు ట్రాక్టర్లను అందజేశారు. ఇందులో 80ట్రాక్టర్లు గ్రామ పంచాయతీ నిధులతో కొనుగోలు చేశారు.  జిల్లా మొత్తం ట్రాక్టర్లకు సుమారు రూ. 24కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. ఇందులో మిగిలిన 70 ట్రాక్టర్లు వారం రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తామని పంచాయతీ రాజ్‌ శాఖ  అధికారులు తెలిపారు. వాహనాలు వచ్చిన గ్రామాల్లో మౌలిక వసతులతో పాటు అభివృద్ధి పనులకు వినియోగిస్తుండటంతో ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో హరితహారంలో నాటిన మొక్కలకు నీరు అందించేందుకు నానా కష్టలు పడ్డారు. హరితహారం మొక్కలకు నీరు పోయడం, పిచ్చిమొక్కల తొలగింపు తదితర కార్యక్రమాలకు వీటిని వినియోగిస్తున్నారు. 

 పల్లెలను ఆదర్శంగా తీరిదిద్దేందుకే..

గ్రామాలను ఆదర్శంగా, అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం పల్లె ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటు మొదటి విడతలో నెల రోజులు రోండో విడతలో పది రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టింది. దీంతో గ్రామాల్లోని పలు సమస్యలు పరిష్కారమయ్యాయి. గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి వాటిని ఖర్చు చేసుకుని గ్రామాల రూపురేఖలు మార్చేసింది. జిల్లాలో ట్రాక్టర్ల కొనుగోలుకు సుమారు రూ. 24కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తుంది. జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ కొనుగోలు చేసి ఇవ్వడం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరింది. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య లోపం లేకుండా చూసుకోవడం దీని ప్రత్యేకత. అదేవిధంగా హరితహారంలో నాటిన మొక్కలకు ప్రతి రోజూ నీటిని అందించేందుకు ట్రాక్టర్లను వినియోగించుకుంటు న్నారు. అదేవిధంగా వైకుంఠధామం, నర్సరీ పనులకు ఉపయోగిస్తున్నారు. ట్రాక్టర్‌తో పంచాయతీలకు ఖర్చు కూడా తగ్గింది. అదేవిధంగా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించే పలు అభివృద్ధి పనులకు కావాల్సిన సామగ్రిని తరలించేందుకూ ఉపయోగపడుతున్నాయి. ట్రాక్టర్లు పల్లెల్లో పరుగులు పెడుతుండటంతో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాలో మొదటి ట్రాక్టర్‌ వడ్లకొండకు 

 పల్లె ప్రగతిలో భాగంగా జిల్లాలో జనగామ మండలం వడ్లకొండ గ్రామానికి మొదటి ట్రాక్టర్‌ను పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెలేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య చేతుల మీదుగా అందజేశారు. గ్రామంతో పాటు పలు మండలాల గ్రామాలకు ప్రభుత్వ ట్రాక్టర్లను పంపిణీకి శ్రీకారం చూట్టారు. logo
>>>>>>