సోమవారం 06 ఏప్రిల్ 2020
Jangaon - Mar 03, 2020 , 02:52:47

ఎమ్మెల్యే రాజయ్యకు మంత్రి కేటీఆర్‌ ఆశీస్సులు

ఎమ్మెల్యే రాజయ్యకు మంత్రి కేటీఆర్‌ ఆశీస్సులు

 స్టేషన్‌ఘన్‌పూర్‌ నమస్తేతెలంగాణ, మార్చి 02: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జన్మదిన వేడుకలు మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్‌ అనుబంధ సంస్థ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని, వేడుకలను జరుపుకున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు పలు దవాఖానాల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మండలంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మొక్కలు నాటారు. పలు గ్రామాల్లో దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సింగపురం దయాకర్‌, టీఆర్‌ఎస్‌ యూత్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మాచర్ల గణేశ్‌, మండల టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు మారపెల్లి ప్రసాద్‌బాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా దాదాపు 100మంది యువకులు రక్తదానం చేశారు. వారికి ప్రశంసా పత్రాలను అందించారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వాహకులను డాక్టర్లు, యువకులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీస్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ మారపాక రవి, కూడా డైరెక్టర్‌ ఆకుల కుమార్‌, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి అక్కనపెల్లి బాలరాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గట్టు రమేశ్‌, మార్కెట్‌ చైర్మన్‌ అక్కనపెల్లి స్వర్ణలత, వైస్‌ చైర్మన్‌ రమేశ్‌నాయక్‌, నాయకులు తోట సత్యం, గుండె మల్లేశ్‌, అశోక్‌, మాతంగీ కుమార్‌, ఆకారపు అశోక్‌, ఇనుగాల నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


logo